Homeఅత్యంత ప్రజాదరణసీఎం జగన్ అంత సీరియస్ ఎందుకయ్యారు?

సీఎం జగన్ అంత సీరియస్ ఎందుకయ్యారు?

ఏపీ కలల ప్రాజెక్ట్ పోలవరం. అలాంటి ప్రాజెక్టుపై బలమైన టీడీపీ మీడియా, ఆ పార్టీ కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. సీఎం జగన్ తెలంగాణ సీఎం, కేంద్రంతో లాలూచీ పడి ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడని.. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నాడంటూ ప్రచారం మొదలుపెట్టాయి. దీనిపై సీఎం జగన్ బాగా సీరియస్ అయ్యారని తెలిసింది. పోలవరం పర్యటన సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుందని సమాచారం.

సీఎం జగన్ ఈరోజు పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం అధికారులతో కలిసి ఒక రివ్యూను నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వాదనల్ని తిప్పి కొట్టాలన్నారు. దాదాపు మూడు గంటల పాటు ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదన్న ఆయన.. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఎఫ్ఆర్ఎల్ లెవల్ 45.72 మీటర్లు ఉంటుందన్నారు. 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలని.. నీరు అందించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం డ్యాం ఎత్తు తగ్గించమని సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు. డ్యాం లెవల్ 55 మీటర్లు ఉంటుందని చెప్పిన జగన్.. డ్యామ్ నిర్మాణంతో పాటు.. పునరావాస కార్యక్రమాల్ని కూడా అంతే వేగంగా పూర్తి చేయాలన్నారు. వచ్చే మే నాటికి స్పిల్ వే.. స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఫోటో గ్యాలరీని పరిశీలించిన ఆయన.. కాఫర్ డ్యాం వద్దకు చేరుకొని.. అక్కడి నిర్మాణ పనుల్ని పరిశీలించారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. హెలికాఫ్టర్ లో ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎంకు మంత్రులు స్వాగతం పలికారు. తాజా సమావేశంలో జగన్ చేసిన ప్రకటన తర్వాత పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారన్న విష ప్రచారానికి చెక్ పడింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version