https://oktelugu.com/

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సరికొత్త రికార్డ్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ రిలీజ్ కాకముందే ఓ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. 2020లో ఒక సినిమాకి సంబంధించి ఎక్కువ ట్వీట్స్ చేసింది ‘వకీల్ సాబ్’ సినిమా మీదనేనట. ఈ విషయాన్ని చిత్రబృందం పోస్టర్ రూపంలో పోస్ట్ చేస్తూ.. తమ సినిమా సృష్టించిన రికార్డ్ ను అభిమానులతో పంచుకున్నారు. పవన్ ఫ్యాన్స్ రీట్వీట్స్ చేస్తూ నిజంగానే ఏ స్టార్ హీరో ఫ్యాన్స్ చేయలేని స్థాయిలో వకీల్ సాబ్ ను ప్రమోట్ చేస్తున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2020 / 07:33 PM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ రిలీజ్ కాకముందే ఓ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. 2020లో ఒక సినిమాకి సంబంధించి ఎక్కువ ట్వీట్స్ చేసింది ‘వకీల్ సాబ్’ సినిమా మీదనేనట. ఈ విషయాన్ని చిత్రబృందం పోస్టర్ రూపంలో పోస్ట్ చేస్తూ.. తమ సినిమా సృష్టించిన రికార్డ్ ను అభిమానులతో పంచుకున్నారు. పవన్ ఫ్యాన్స్ రీట్వీట్స్ చేస్తూ నిజంగానే ఏ స్టార్ హీరో ఫ్యాన్స్ చేయలేని స్థాయిలో వకీల్ సాబ్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఇక వేణు శ్రీరామ్ డైరెక్షన్ చేస్తున్న ఈ ‘పింక్’ తెలుగు రీమేక్ పై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

    Also Read: మళ్ళీ మాజీ బబ్లీ బ్యూటీ రెడీ.. అందు కోసమేనట !

    కాగా వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 13న పెద్ద ఎత్తున ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు బాగా ప్లాన్ చేసుకున్నప్పటికీ.. ఇంకా థియేటర్స్ పై క్లారిటీ రాకపోవడంతో మళ్ళీ ఈ సినిమా పోస్ట్ ఫోన్ అయ్యేలా కనిపిస్తోంది. దీనికితోడు కరోనా. కరోనా పెరుగుతున్న దృష్ట్యా పవన్ లాంటి హీరో సినిమాని థియేటర్ లో రిలీజ్ చేస్తే.. రద్దీ ఎక్కువ అవుతుంది. పైగా పవన్ రీఎంట్రీ ఇస్తోన్న మొట్టమొదటి సినిమా. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం అసాధ్యం. ఇదే విషయాన్ని పవన్ కూడా దిల్ రాజు సూచించి రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేద్దాం అని చెప్పారట.

    Also Read: ట్విట్టర్ హీరోలు వీరే!

    ఇక ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి పవన్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. మరి అది ఓవర్ హైప్ గా క్రియేట్ అయితే మాత్రం.. అసలుకే మోసం వస్తోంది. కానీ, సినిమా బాగుంది అని టాక్ వస్తే మాత్రం.. పవర్ స్టార్ రీఎంట్రీతో టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ను తిరగరాయడం గ్యారంటీ. అన్నట్లు ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు అలాగే పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్లు స్క్రిప్ట్ లో చాలా మార్పులను దిల్ రాజు చేయించారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్