https://oktelugu.com/

పెరిగిన డిమాండ్.. ప్రశాంత్ కిశోర్ ఈసారి ఎవరి వైపు..?

ప్రశాంత్ కిశోర్.. ఈ పేరు తెలియని రాజకీయ నాయకులుండరు. ఆయన అడుగుపెడితే అక్కడ ప్రకంపనలే. ఆయన చెప్పిన పార్టీ తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం కొందరి నేతల్లో బలంగా ఉంది. అందుకే ఆయన మద్దతు కోసం ఆయా పార్టీల నాయకులు విపరీతంగా ప్రయత్నిస్తారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ బెస్ట్ ఇమేజ్ ఉంది. ఏ ఎన్నికలైనా తాను మద్దతిచ్చే పార్టీ గెలుపుకోసం.. ప్రతీ గ్రామంలో సర్వే చేయించి ఆ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తారు. ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు […]

Written By: , Updated On : March 4, 2021 / 10:00 AM IST
Follow us on

ప్రశాంత్ కిశోర్.. ఈ పేరు తెలియని రాజకీయ నాయకులుండరు. ఆయన అడుగుపెడితే అక్కడ ప్రకంపనలే. ఆయన చెప్పిన పార్టీ తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం కొందరి నేతల్లో బలంగా ఉంది. అందుకే ఆయన మద్దతు కోసం ఆయా పార్టీల నాయకులు విపరీతంగా ప్రయత్నిస్తారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ బెస్ట్ ఇమేజ్ ఉంది. ఏ ఎన్నికలైనా తాను మద్దతిచ్చే పార్టీ గెలుపుకోసం.. ప్రతీ గ్రామంలో సర్వే చేయించి ఆ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తారు. ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు ఆయన వేసిన పన్నాగం చూసి రాజకీయ నాయకులు షాక్ తింటారు.

ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకేగా పిలువబడిన ఈయన గతంలో ఎన్నో రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించి ఆ పార్టీ గెలుపుకోసం కృషి చేశారు. దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ముద్ర ఉంది. ప్రశాంత్ కిశోర్ వ్యూహంతో మోడీ, నితీశ్ కుమార్, అమరీందర్ సింగ్, జగన్ అధికార పీటంపై కూర్చున్నట్లు అనుకుంటారు. నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ పేరు మారుమోగుతోంది. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తారు..? ఎవరికి వ్యూహ కర్తగా పనిచేస్తారు..? అన్న చర్చ సాగుతోంది.

1977లో బక్సర్ ప్రాంతంలో ప్రశాంత్ కిశోర్ జన్మించారు. 2011లో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.2012లో గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తరువాత 2014లో మోడీ ప్రధాని కావడానికి పీకే మాములుగా సర్వే చేయలేదని రాజకీయ వర్గాలు పేర్కొంటాయి. అంతేకాకుండా బీహార్, పంజాబ్, యూసీ, ఏపీ, ఢిల్లీ రాష్ట్రాలకు ఆయన వ్యూహ కర్తగా పనిచేసి పేరుప్రఖ్యాతలు సాధించాడు.

గతంలో బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రశాంత్ కిశోర్ పెద్ద ప్రణాళిక వేశాడు. దీంతో నితీశ్ ఆయనను తన పార్టీ వైస్ ప్రెసిడెంట్ చేశాడంటే ఆయన స్ట్రాటజీ ఎంటో అర్థమవుతోంది. 2017లో పంజాబ్ లోజరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేసి అమరీందర్ సింగ్ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు.

అయితే అదే సంవత్సరంలో యూపీలో సమాజ్ వాదీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందకు పనిచేసిన పీకే విఫలమయ్యాడు. ఇక ఏపీలో 2019లో వైసీపీ విజయం సాధించడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ అధికారంలోకి రావడానికి పీకీ పెద్ద వ్యూహమే రచించాడు.

ప్రశాంత్ కిశోర్ వేసే స్కెచ్ తన టీం మెంబర్లకు కూడా తెలియదట. రాజకీయ నాయకులకు ఆయన ఎలాంటి హామీలు ఇవ్వాలి..? జనం ఏం కోరుకుంటున్నారు..? లాంటి విషయాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అలాగే మెనిఫెస్ట్లో లో ఎలాంటి అంశాలు చేర్చాలన్న దానిపై కూడా ప్రశాంత్ రాజకీయ నాయకులకు వివరిస్తాడట. అందుకే ప్రశాంత్ మద్దతు ఇచ్చిన పార్టీలు విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఇక త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ ఎవరి తరుపున పనిచేస్తాడోనన్న చర్చ తీవ్రంగా సాగుతోంది.