https://oktelugu.com/

ఏపీలోని ఆ జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్..?

దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా 5,000కు పైగా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. పలు జిల్లాల్లో వైరస్ ఉధృతి నేటికీ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తిని తగ్గించాలనే ఉద్దేశంతో అధికారులు పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అధికారులు జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 11, 2020 / 09:21 AM IST
    Follow us on

    దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా 5,000కు పైగా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. పలు జిల్లాల్లో వైరస్ ఉధృతి నేటికీ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తిని తగ్గించాలనే ఉద్దేశంతో అధికారులు పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.

    శ్రీకాకుళం జిల్లా అధికారులు జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి లాక్ డౌన్ అమలవుతుండగా రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సమాచారం. సాధారణ రోజులతో పోలిస్తే ఆదివారం రోడ్లపై జనసంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

    ఆస్పత్రులు, మెడికల్ షాపులకు మాత్రమే అధికారులు అనుమతులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఎవరైనా లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించినట్టు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. జంక్షన్లు, ప్రధాన మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అనవసరంగా వాహనాలు రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో శ్రీకాకుళంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

    ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి వల్ల జిల్లాలో వైరస్ వ్యాప్తి జరగగా నిన్న ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో 163 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,486 కు చేరగా 329 మంది మృతి చెందారు. జిల్లాలో ప్రస్తుతం 1,818 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఏడున్నర లక్షలు దాటగా 6,000కు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి.