జనసేనాని.. బయటకు రావాల్సిందేనా?

ఎన్నో ఆశయాలు… మరెన్నో సిద్ధాంతాలు.. ఇంకెన్నో లక్ష్యాలతో పవర్‌‌ స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించారు. పోయిన ఎన్నికల ముందే పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఊగిపోయారు కూడా. పిడికిలి బిగించి జగన్‌ను నిలదీశారు. అప్పుడప్పుడు కవ్వించారు.. అప్పుడప్పుడు ఓదార్చారు.. ఇప్పుడు ఆ ఎంటర్‌‌టైన్‌మెంట్‌ అంతా అటు జనసేన కార్యకర్తలు, ఇటు ప్రజలు కూడా మిస్‌ అవుతున్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. Also Read: పెద్ద స్కెచ్: జగన్‌ ఓటు బ్యాంకు పాలిటిక్స్‌? ఓ వైపు రాష్ట్రాన్ని […]

Written By: NARESH, Updated On : October 17, 2020 3:03 pm
Follow us on

ఎన్నో ఆశయాలు… మరెన్నో సిద్ధాంతాలు.. ఇంకెన్నో లక్ష్యాలతో పవర్‌‌ స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించారు. పోయిన ఎన్నికల ముందే పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఊగిపోయారు కూడా. పిడికిలి బిగించి జగన్‌ను నిలదీశారు. అప్పుడప్పుడు కవ్వించారు.. అప్పుడప్పుడు ఓదార్చారు.. ఇప్పుడు ఆ ఎంటర్‌‌టైన్‌మెంట్‌ అంతా అటు జనసేన కార్యకర్తలు, ఇటు ప్రజలు కూడా మిస్‌ అవుతున్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

Also Read: పెద్ద స్కెచ్: జగన్‌ ఓటు బ్యాంకు పాలిటిక్స్‌?

ఓ వైపు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ.. జనసేనాని జాడ మాత్రం లేదు. అప్పుడెప్పుడో లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రధాని మోడీ పిలుపు మేరకు గంటకొట్టి, దీపాలు వెలిగించి తన ఉనికి చాటారు. చాతుర్మాస దీక్షలో పూర్తిగా మునిగిన పవన్ ప్రజల్లోకి రావడమే మానేశారు.. ఇటు వరదల టైమ్‌లోనూ పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలోకి రాలేదు. ఆయన కానీ వస్తే ఆ సీన్‌ మరింత రక్తి కట్టేదని అంటున్నారు ఆయన అభిమానులు.

నారా లోకేష్ బురదలో దిగి.. ప్యాంట్ మడతపెట్టి నానా హంగామా చేశారు. పవన్‌ కల్యాణ్‌ కూడా సీన్‌ లోకి అడుగుపెడితే అంతకన్నా రెట్టింపు ఎంటర్‌‌టైన్‌మెంటే కనిపించేదేమో. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేదేమో.. కరోనా లాక్ డౌన్ వేళ పూర్తిగా ఆధ్యాత్మిక లోకంలో బతికిన జనసేనానిని చూసి అందరూ మారాడాని అనుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఏపీ ప్రజల సమస్యలపై కదిలిరాని వైనంపై అందరూ నిరాశ చెందుతున్నారు.

Also Read: జగన్ ఇస్తానన్నా.. వాళ్లు ఇంట్రస్ట్ చూపించడం లేదట.!

అయితే.. ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వం, ప్రతిపక్షం బురద రాజకీయాలు ప్రారంభించాయి. కానీ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాత్రం దీనిపై మాట్లాడ్డం లేదు. పవన్ వరదల్లో బైటకు వస్తే అధికార వర్గానికి కొంచెం జలక్ రావడం ఖాయం. ఎన్నో పంచ్ డైలాగులు వస్తాయి. వీటిన్నిటితో జనసేన సోషల్ మీడియా బ్యాచ్‌కు కూడా యాక్టివ్ అయ్యేది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా యాడ్‌ చేసి అదరగొట్టే వారేమో. ఇప్పటికైనా పవన్‌ బయటకు రావాల్సిన అవసరం ఉందనేది గుర్తించాలి.