టాలీవుడ్ దంపతులు జీవిత రాజశేఖర్ కరోనా బారిన పడ్డారు. వారం రోజుల క్రితమే వీరికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాల్లో వార్తలు రావడంతో శనివారం రాజశేఖర్ ధ్రువీకరించారు. కాగా రాజశేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జీవిత హోం ఐసోలేషన్లో ఉన్నట్లు సమాచారం. అలాగే వారి కుమార్తెలు శివాని, శివాత్మికలకు కూడా పోసిటివ్ నిర్దారణ అయింది. కరోనా మహమ్మారి టాలీవుడ్ ప్రముఖులపై పంజా విసురుతోంది. ఇప్పటికే నాగబాబు, రాజమౌళి లాంటి వారికి సోకిన విషయం తెలిసిందే. అయితే వారు చికిత్స తీసుకొని కోలుకున్నారు. కాగా ప్రముఖ సింగర్ బాలసుబ్రహ్మణ్యంను కరోనా బలి తీసుకోవడం సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.