రష్యాలోని ఓ భవనం గురించి ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ భవనం రష్యా అధ్యక్షుడు పుతిన్ దేనని, ఆయన అవినీతికి ఇదే పరాకాష్ట అని ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీ ఆరోపించాడు. అంతేకాకుండా ఆయన ఆ భవనానికి సంబంధించిన ఓ వీడియోను బయటపెట్టి సంచలనం సృష్టించాడు. దీంతో రష్యా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆందోళనకారులపై ప్రభుత్వం కాల్పులు కూడా జరిపింది. అంతేకాకుండా భవనం గురించి ఆరోపించిన నవల్నీపై విష ప్రయోగం చేయడంతో ఆయన జర్మనీలో చికిత్స చేసుకొని తిరిగి రష్యాకు వచ్చారు. కానీ ఆయనను కొన్ని కేసుల్లో ప్రభుత్వం జైళ్లో పెట్టింది.. అయితే ఆ భవనం సంగతేంటి..? ఈ భవనంపై ఆరోపణలు ఎందుకు వచ్చాయి..? ఇంతకీ భవనానికి పుతిన్ కు ఉన్న సంబంధమేంటి..?
Also Read: చంద్రబాబు ఫెయిల్ అయ్యింది.. జగన్ పాస్ అయ్యింది ఇక్కడే?
రష్యాలోని సముద్ర తీరంలో ఉన్న ఈ భవనం అధ్యక్షుడు పుతిన్ కి చెందినదేనని నవాల్నీ ఆరోపిస్తున్నాడు. అన్నీ హంగులు, విలాస సౌకర్యాలు కలిగిన ఇందులో కేవలం బూజు పట్టిందని, దానిని తొలగించడానికి రూ.కోట్లు ఖర్చుపెడుతున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆ భవనం లోపలి భాగాన్ని సైతం వీడియోగా చిత్రీకరించిన నవాల్నీ తాజాగా జైలులో ఉండగానే ఈ వీడియోను కొందరు బయటపెట్టడం గమనార్హం.
‘సముద్ర తీరాన ఈ భవనం ఉండడంతో అందులోకి గాలి ఎక్కువగా చొరబడలేదు. దీంతో బూజు పట్టిపోయి భవనం వికారంగా తయారైంది. అయితే ఈ బూజు మొదటి అంతస్తులోనే ఉంది. మిగతా అంతస్తుల్లో మాత్రం కనిపించడం లేదు.’ అని ఇందులో పనిచేసే కార్మికులు చెబుతున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
Also Read: ఊపులేని ఉక్కు ఉద్యమం..?
ఈ బూజును నివారించేందుకు భవనాన్ని కూల్చి మళ్లీ కడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకు కోట్లలో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించి పుతిన్ పీఠానికే ప్రమాదం ఏర్పడేటట్లు తయారైంది.
అయితే రష్యా అధ్యక్షుడు మాత్రం ప్రతిపక్ష నేత నవాల్ని ఆరోపణలు అవాస్తవమని.. తనకు సంబంధించిన భవనం ఇంకా నిర్మాణంలో ఉందంటున్నాడు. కట్టకథలు అల్లీ తనపై ఆరోపణలు చేస్తున్నాడని అంటున్నాడు. అయితే కొందరు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లగా వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ నో ఫ్లై జోన్ ఏర్పాటు చేయడంతో విమానాలు సైతం ఇటువైపు రావడం లేదు.