https://oktelugu.com/

దీదీకి పోటీగా దాదా

పశ్చిమబెంగాల్‌లో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. గెలుపు నీదా నాదా అంటూ రేసులో దూసుకెళ్తున్నారు. మమతా బెనర్జీని గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగ్గ సమర్థ సారథి కోసం చూస్తోంది. పైకి బహిరంగంగా చెప్పకున్నా దీదీని ఢీకొట్టి రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడి కోసం వెతుకులాడుతున్నారు. Also Read: టైమ్స్ నౌ సర్వే: ఏ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 10, 2021 10:38 am
    Follow us on

    Mamata Ganguly
    పశ్చిమబెంగాల్‌లో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. గెలుపు నీదా నాదా అంటూ రేసులో దూసుకెళ్తున్నారు. మమతా బెనర్జీని గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగ్గ సమర్థ సారథి కోసం చూస్తోంది. పైకి బహిరంగంగా చెప్పకున్నా దీదీని ఢీకొట్టి రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడి కోసం వెతుకులాడుతున్నారు.

    Also Read: టైమ్స్ నౌ సర్వే: ఏ రాష్ట్రంలో ఎవరిది గెలుపు?

    ఈ క్రమంలో వారికి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు దాదా సౌరవ్‌ గంగూలీ. ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు కమలనాథులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదా తన రాజకీయ రంగం ప్రవేశంపై వస్తున్న వార్తలను ఖండించకపోవడంతోపాటు నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. ‘ఏం జరుగుతుందో చూద్దాం. నా జీవితం గతంలో ఎన్నో అనూహ్య మలుపులు తీసుకుంది’ అన్నది రాజకీయ ప్రవేశంపై గంగూలీ తాజా స్పందన.

    గంగూలీ బీజేపీలో చేరుతారని చాన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. ఎందుకంటే.. కమలదళం పెద్దలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం దాదా బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా ఆ సంస్థ కార్యదర్శిగా ఉన్నారు. వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వాస్తవానికి దాదా రాజకీయ అరంగేట్రం ఖాయమని గతేడాది చివర్లోనే వార్తలొచ్చాయి. కానీ.. జనవరిలో ఆయనకు స్పల్ప గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. తర్వాత మళ్లీ స్టంట్లు వేయించుకున్నారు. అనారోగ్యం కారణంగానే ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఆయన అనారోగ్యం బారిన పడినప్పుడు స్వయానా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేసి పరామర్శించారు. దాదాను చూసేందుకు బెంగాల్‌ గవర్నర్‌‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ స్వయంగా ఆస్పత్రికి వెళ్లారు.

    Also Read: కరోనా కల్లోలం: దేశంలో ఎంత ఉపాధి నష్టమో తెలుసా?

    రాజకీయ ప్రవేశంపై చాన్నాళ్లుగా మౌనం పాటిస్తున్న దాదా ఎట్టకేలకు పెదవి విప్పారు. తన అరంగేట్రంపై స్పష్టతనివ్వకపోయినా.. రాజకీయాలపై దాదా తాజాగా సానుకూలంగానే మాట్లాడారు. ‘రాజకీయ రంగం చెడ్డదేం కాదు. ఆ రంగానికి చెందిన పలువురు నేతలు కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. రాజకీయాలు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆ రంగంలో మంచి వ్యక్తులు ఉండాలి. ఎవరికి ఇష్టమైన పనిని వారు చేయడం ముఖ్యం’ అని పేర్కొన్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్