
కరోనా వైరస్ విజృంభణ వల్ల దేశంలో చాలామంది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కంటే సొంత వాహనాల్లో ప్రయాణించడానికే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే సెకండ్ హ్యాండ్ బైక్ లు, సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం కొత్తగా బైక్ కొనుగోలు చేయాలంటే లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేస్తే 30,000 నుంచి 40,000 లోపే మంచి బైక్ సొంతమవుతుంది.
Also Read: బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసేవాళ్లకు ఆర్బీఐ శుభవార్త..?
సెకండ్ హ్యాండ్ బైక్ లు ఆన్ లైన్ లోనే తక్కువ ధరకు పలు వెబ్ సైట్లు అందుబాటులోకి తెస్తున్నాయి. droom వెబ్ సైట్ లో తక్కువ ధరకే వేర్వేరు కంపెనీలకు చెందిన సెకండ్ హ్యాండ్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఓలెక్స్, క్వికర్ వెబ్ సైట్లతో పాటు ప్రముఖ కంపెనీలు సైతం షోరూంలలో తక్కువ ధరలకే సెకండ్ హ్యాండ్ బైక్, కార్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కంపెనీలు బైక్ లకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుతున్నాయి.
Also Read: ఒక్క రూపాయి కట్టకుండానే కారు కొనే ఛాన్స్.. ఎలా అంటే..?
అందువల్ల సెకండ్ హ్యాండ్ బైక్ అయినా బైక్ కు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకుని బైక్ ను కొనుగోలు చేయవచ్చు. droom వెబ్ సైట్ 2013 మోడల్ మహీంద్రా సెంచురో 110 సీసీ బైక్ కు 38,000 రూపాయలకు అందుబాటులో ఉంచింది. ఈ వెబ్ సైట్ లో బజాజ్ పల్సర్ 150 సీసీ బైక్ ధర 38,000 రూపాయలుగా ఉంది. 2013 మోడల్ యమహా ఎఫ్‌జెడ్ఎస్ 150 సీసీ బైక్ ధర 56,000 రూపాయలుగా ఉంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఈ వెబ్ సైట్ లో 20,000 రూపాయల నుంచి కూడా బైక్ లభిస్తూ ఉండటం గమనార్హం. అయితే బైక్ ను కొనుగోలు చేసే ముందు కొత్త మోడళ్ల ధరలను పరిశీలించి కొనుగోలు చేయడం ఉత్తమం.