https://oktelugu.com/

తండ్రి అయిన విరాట్ కోహ్లీ.. తొలి సంతానం ఎవరంటే?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. ఆయన భార్య, హీరోయిన్ అనుష్క శర్మ ఈ మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే విరాట్ కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. Also Read: అయినా.. ఆయనకు ఇంకా బుద్ధి రాలేదు ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని.. తమ జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైందని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. ఇప్పటికే సిడ్నీ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2021 / 04:46 PM IST
    Follow us on

    భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. ఆయన భార్య, హీరోయిన్ అనుష్క శర్మ ఈ మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే విరాట్ కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు.

    Also Read: అయినా.. ఆయనకు ఇంకా బుద్ధి రాలేదు

    ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని.. తమ జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైందని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.

    ఇప్పటికే సిడ్నీ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియాను ఉదయం విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. బాగా ఆడారని పొగడ్తలు కురిపించాడు.

    Also Read: సిడ్నీ టెస్ట్: గోడకట్టిన అశ్విన్, విహారి.. ఛాన్స్ మిస్ చేసిన టీమిండియా

    ఇక సిడ్నీలో అద్భుత పోరాట ప్రతిభతో మూడో టెస్టును డ్రా చేసుకున్న రోజునే కోహ్లీ తండ్రి కావడం విశేషం. ఈరోజు భారత మాజీ క్రికెట్ ద్రావిడ్ పుట్టిన రోజు కావడం గమనార్హం.

    ఆస్ట్రేలియా సిరీస్ ను వదులుకొని మరీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య డెలివరీ కోసం వచ్చేశాడు. క్వారంటైన్ నిబంధనల కారణంగా తిరిగి జట్టుతో చేరే అవకాశం విరాట్ కు లేకుండా పోయింది.