తెలుగు రాష్ట్రాల రాజకీయాలను పరిశీలిస్తే ఏ ముఖ్యమంత్రి తన కుమారులను సీఎంలను చేయలేకపోయారు. ప్రజాదరణను విపరీతంగా పొందిన ఎన్టీఆర్ సైతం తన కొడుకులను అధికారపీఠంపై కూర్చుండబెట్టలేకపోయారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్ మాత్రం అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఎవరికీ దక్కని ఈ అవకాశం జగన్ కు మాత్రమే ఎందుకు దక్కింది..? ఇందుకు కారణాలేంటి..? ఆయన సీఎం కావడానికి ఎవరు దోహదపడ్డారు…? సీఎంగా అవ్వడానికి జరిగిన పరిణామాలేంటి..? అనే విషయాల్లోకి వెళితే..
Also Read: బాబు భరోసా.. వైసీపీ పతనానికి ‘పంచాయితీ’ నాందియా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారం కోసం ఆయా పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతూ ముందుుకు సాగుతుంటారు. ఇందులో కొందరు విజయం సాధించగా.. మరికొందరు అపజయం పాలవుతారు. అయితే చివరికి మాత్రం ప్రజల చేతిలో ఓడిపోతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరువాత ఏపీలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ.
నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మొదటిసారిగా టీడీపీ అధికారంలోకి రాగా.. ప్రస్తుతం వైసీపీ పరిపాలిస్తోంది. 151 సీట్లతో ఎవరూ ఊహించని రీతిలో మెజారిటీ తెచ్చుకొని ఏ పార్టీ అవసరం లేకుండా ప్రభుత్వం నడుపుతోంది. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడైన జగన్ పై ప్రజలు ఇంతలా అభిమానం పెంచుకోవడానికి కారణం ఏంటి..? ఇతర పార్టీలపై అంత అసహ్యం ఎందుకు కలిగిందంటే..?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అంటే దాదాపు కొంతమందికే తెలుసు. ఏవో వ్యాపారులు చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోయేవారు. అయితే పరిటాల రవి వ్యవహారంలో ఆయన పేరు మారుమోగింది. ప్రభుత్వం నిధులు తన వ్యాపారాలను మళ్లించుకుంటున్నారని టీడీపీ ఎవరికీ తెలియని జగన్ ను ప్రజలకు తెలిసేలా చేసింది. అప్పటికే చాటుమాటుగా ఆయనపై సోనియాగాంధీ ప్రభుత్వం కత్తి దూసేందుకు రెడీ అవుతున్న తరుణంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారు.
ఆ తరువాత జగన్ ను సీఎం కావడానికి అనేక శక్తులు అడ్డుకున్నాయి. వైఎస్ కుటుంబానికి కాకుండా రోశయ్య గారికి బాధ్యతలు అప్పగించగా… ఆయన వల్ల కాకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించారు. ఈ సమయంలో మరోవైపు జగన్ పై అక్రమాస్తుల కేసులంటూ ఆయనను తొక్కేసేందుకు యత్నించారు. విచారణ పేరిట రోజూ ఆయనను సీబీఐ కార్యాలయానికి వెళ్తున్న తరుణంలో ఆయనకు తెలియకుండానే ప్రజనాయకుడయ్యాడు.
Also Read: హైదరాబాద్ యూటీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అసలు జగన్ అంటే ఎవరు..? ఆయనపై ప్రభుత్వం ఎందుకింద కక్ష్య సాధింపు చేసింది..? అనే విషయాలపై వెతకడం ప్రారంభించారు. దీంతో జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జగన్ ఆంధ్ర ప్రజలకు చేరువయ్యారు. అయితే 2014లో ఆయన ఆంధ్రప్రదేశ్లోని పూర్తి జనానికి ఆయన తెలియదు. అందువల్ల ఈ సమయంలో అధికారంలోకి రాలేకపోయారు.
కానీ అధికారంలోకి వచ్చిన టీడీపీ జగన్ ను దృష్టిలో పెట్టుకొని పాలించడంతో ప్రజలు జగన్ పై దృష్టి మరల్చారు.ఆయన పాదయాత్ర ప్రజలకు చేరువ చేసింది. మరోవైపు టీడీపీ చేస్తున్న ఆగడాలను పరిశీలించారు. ఈ తరుణంలో జగన్ ను ఆదరించి 2019లో అధికారంలో కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు టీడీపీ తామే మంచి పార్టీ అని చెబుతున్నా.. గత ప్రభుత్వ పాలన వైఫల్యాలను జనాలు మరిచిపోవడంలేదు. జగన్ తన పాలన చాతుర్యంతోనే ప్రజలకు చేరువ అవుతున్నారు. పథకాలు, అభివృద్ధితో ప్రజల మనసు చూరగొంటున్నారు. చంద్రబాబు ఫెయిల్ అయ్యింది ఇక్కడేనంటున్నారు. జగన్ ఏ పనిని అయినా త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తాడు. చంద్రబాబు సాగదీస్తూ ఉంటాడు. జగన్ స్పీడ్ పాలనే ఆయనను ప్రజల్లో గెలిచేలా చేస్తోందని అంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్