
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న రిమేక్ చిత్రం నుంచి తాజాగా ఓ పిక్ లీక్ అయ్యింది. మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనమ్ కోషియం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ -రానా దగ్గుబాటి మొదటిసారి నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రంపై తెలుగులో బోలెడు అంచనాలున్నాయి. ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తాను పవన్‌కళ్యాణ్‌తో కలిసి ఈ చిత్రం నటించబోతున్నట్టు డిసెంబర్ 21న రానా ఖాయం చేశాడు. “మరొక జర్నీ ప్రారంభమవుతుంది. ఇది ఎంతో ఆనందం, పరిశ్రమలలో చాలా మంది తారలతో పని చేశాను. మా సొంత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తో నటించడానికి వేచి ఉండలేను అంటూ ట్వీట్ చేశారు.
ఈ చిత్రం షూటింగ్ జనవరి 25న ప్రారంభమైంది. శరవేగంగా జరుగుతోంది. అయ్యప్పమ్ కోషియం చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అహం ఘర్షణను చూపిస్తుంది.
నివేదికల ప్రకారం, రానా పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తుండగా.. పవన్ కళ్యాణ్ బిజు మీనన్ పాత్రలో కనిపిస్తారు. ఈ మూవీకి తాత్కాలికంగా పీఎస్.పీ.కే30 అని పేరు పెట్టారు. దీనికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక ఫొటో లీక్ అయ్యింది. అది వైరల్ అయ్యింది. ట్విట్టర్ లో ‘#పిఎస్‌పికెరానామూవీ’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ -క్రిష్ మూవీ ‘హరి హర వీర మల్లు’ఫస్ట్ లుక్ కూడా తాజాగా శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫొటో లీక్ తో పవన్ ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతున్నారు.
𝐏𝐨𝐰𝐞𝐫𝐒𝐭𝐚𝐫 @PawanKalyan From The Sets of #PSPKRanaMovie ❤️
pic.twitter.com/innDd5MTh1— Trend PSPK (@TrendPSPK) March 12, 2021