
సాధారణంగా మన అగ్రహీరోలు ఫోన్లు వాడుతారో? వాళ్లు సైతం వాట్సాప్ వినియోగిస్తారో లేదో కూడా చాలామందికి తెలియదు. వాళ్ల సోషల్ మీడియాను వేరే వాళ్లు హ్యాండిల్ చేస్తారన్న ప్రచారం ఉంది. దీనికోసం వాళ్లు టెక్నికల్ నిపుణులను పెట్టుకుంటారని చెబుతుంటారు. ఈ విషయంలో ఆ హీరోలు బయటపెడితేనే ఇది తెలుస్తుంది.
అయితే మన అగ్రహీరోలు కూడా సోషల్ మీడియాను వాడుతారు. తాజాగా చిరంజీవి, మహేష్ బాబులు జరిపిన వాట్సాప్ సంభాషణలను నాగార్జున బయటపెట్టాడు. వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబు, చిరంజీవిలు హీరో నాగార్జునతో జరిపిన వాట్సాప్ సంభాషణలు బయటపడ్డాయి. వీటిని హీరో నాగార్జుననే బయటపెట్టడం విశేషం. వాళ్ల అనుమతి తీసుకొనే వీటిని షేర్ చేశారు.
ఈరోజు వైల్డ్ డాగ్ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ను ముందుగానే నాగార్జున.. మహేష్ బాబు, చిరంజీవిలకు పంపి వారి అభిప్రాయాలు తెలుసుకున్నాడు.ఈ ట్రైలర్ చూసి చాలా బాగుందంటూ వాట్సాప్ తో మహేష్, చిరు రిప్లయ్ ఇచ్చాడు. ఈ విషయంపై చిరంజీవి నాగార్జున మాట్లాడుకున్నారు.
ఇలా వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ ను నాగార్జున కొత్త పుంతలు తొక్కారు. ఇక మహేష్ బాబు స్క్రీన్ షాట్ చూసి అతడి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మహేష్ తన డీపీగా సింహం ఫొటో పెట్టుకోవడం విశేషం. ‘ది లయన్ కింగ్’ సినిమాలోని స్టిల్ ను మహేష్ పెట్టుకున్నాడు.