బీజేపీలోకి రాములమ్మ.. ముహుర్తం ఖరారైందా?

సినిమా, రాజకీయం రెండింటిలో ప్రభావం చూపే సెలబ్రెటీల్లో విజయశాంతి ఒకరు. సినిమాల్లో లేడి అమితాబ్ గా పేరుతెచ్చుకొని నెంబర్ వన్ హీరోయిన్ గా అప్పట్లో కొనసాగారు. అయితే రాజకీయంగా మాత్రం విజయశాంతి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్లపాటు బీజేపీ, టీఆర్ఎస్ లో కొనసాగిన రాములమ్మ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ స్టార్డమ్ కలిగిన విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో […]

Written By: NARESH, Updated On : November 8, 2020 5:45 pm
Follow us on

సినిమా, రాజకీయం రెండింటిలో ప్రభావం చూపే సెలబ్రెటీల్లో విజయశాంతి ఒకరు. సినిమాల్లో లేడి అమితాబ్ గా పేరుతెచ్చుకొని నెంబర్ వన్ హీరోయిన్ గా అప్పట్లో కొనసాగారు. అయితే రాజకీయంగా మాత్రం విజయశాంతి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్లపాటు బీజేపీ, టీఆర్ఎస్ లో కొనసాగిన రాములమ్మ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

స్టార్డమ్ కలిగిన విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో వాడుకోకపోవడంపై ఆమె పలుసార్లు బహిరంగగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెసులోని గ్రూపు రాజకీయాలపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోవడంతో ఆమె కొద్దిరోజులుగా సైలంటయ్యారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ధీటుగా బీజేపీ తెలంగాణ బలపడుతుండటంతో ఆమె బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

దుబ్బాక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని సరిగ్గా ఉపయోగించుకో లేకపోయింది. దీంతో ఆమె దుబ్బాకలో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. విజయశాంతి కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలోనే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆమెతో భేటి అయి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే పార్టీ మార్పుపై విజయశాంతి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Also Read: చంద్రబాబుకు మరో షాక్.. టీడీపీకి మాజీ మంత్రి గుడ్ బై

విజయశాంతి పార్టీ మారుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ ఆమె ఇంటికి వెళ్లి పార్టీ మారవద్దని సూచించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆమె తన ఫేసుబుక్ చేసిన వ్యాఖ్యలతో ఆమె పార్టీ మారడం ఖాయమనే సంకేతాలు కన్పిస్తున్నాయి.

‘ఎవరు తీసుకున్న గోతిలోవారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించింది.. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి.. ఇంకొందరిని భయపెట్టి.. ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరేస్థాయికి వచ్చింది. మరికొంత ముందుగానే మాణిక్యం ఠాగోర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి..’ అంటూ పోస్టు పెట్టారు.

దీంతో విజయశాంతి బీజేపీ వైపు చూస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దుబ్బాక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆమె బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. విజయశాంతి వంటి పేరున్న లీడర్ తోనే బీజేపీ ఘర్ వాపసీ షూరు కానుందని సమాచారం. ఈనెల 24న ఆమె కేంద్ర మంత్రి అమిషా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటుందని.. ఈమేరకు ముహుర్తం కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు విన్పిస్తోంది.

Also Read: భారత ఆర్థిక వ్యవస్థ నిలబడేది ఎప్పుడు?

ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాజకీయాల్లో మాస్ లీడర్ గా పేరున్న విజయశాంతి కాంగ్రెస్ ను వీడితే ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రాములమ్మను పార్టీ మారకుండా ఏమేరకు ఆపగలుతారనేది ఆసక్తికరంగా మారింది.