అమెరికా నూతన అధ్యక్షుడిగా జోబైడెన్ అమెరికా ఎన్నికల ప్రచారంలో హామీఇచ్చినట్టే వలసదారుల విషయంలో ఉదారంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్వయంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం ఒక వలస వాదురాలే కావడంతో విదేశీ నిపుణులకు జోబైడెన్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
అమెరికాలో దాదాపు 1.1 కోట్ల మంది అనధికార వలసదార్లకు అమెరికా పౌరసత్వం కల్పించే విషయంపై తన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే ఖచ్చితంగా దాదాపు 5 లక్షల మంది భారతీయులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది భారతీయ కుటుంబాలకు జోబైడెన్ ప్రభుత్వం రావడం వరమని అనుకుంటున్నారు. గ్రీన్ కార్డుల జారీ విషయంలోనూ జోబైడెన్ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ ని అమలు చేయవచ్చని భావిస్తున్నారు. ఇమ్మిగ్రంట్లకు అనువుగా నగరాలు, కౌంటీలు, కొత్త వీసా కేటగిరిని సృష్టించాలని జోబైడెన్ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Also Read: చెత్త రికార్డు: రెండోసారి గెలవని అధ్యక్షుడిగా ట్రంప్
హెచ్1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ లేదా విదేశీ భర్తలు, లేదా భార్యల వర్క్ పర్మిట్లను జోబైడెన్ ప్రభుత్వం పునద్ధరించి గతంలో ఉన్న నిబంధనలను మార్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. హెచ్1బీ వీసాలతోపాటు హైస్కిల్డ్ వీసాల సంఖ్యను ఆయన పెంచవచ్చునని భావిస్తున్నారు.
Also Read: జోబైడెన్ తొలి ప్రసంగం.. ఏం వరాలిచ్చాడంటే?
అలాగే వలసదారులపై, వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను రద్దు చేయవచ్చని అందరూ బోలెడు ఆశలు పెంచుకున్నారు.ఇమ్మిగ్రేషన్ పాలసీని సైతం జోబైడెన్ సవరిస్తారని తెలుస్తోంది.