కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా కరోనానే. చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా 3వేలకుపైగా మృత్యువాత పడ్డారు. తాజాగా ఈ కరోనా వైరస్ ఇండియాకు చేరింది. దీంతో భారతీయులు బెంబేలెత్తిపోతున్నారు. కేరళలోలో 30కిపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
కరోనా వైరస్ కారణంగా కేరళలో రేపటి నుంచి సినిమా థియేటర్లు మూతబడనున్నాయి. ఇక హైదరాబాద్లో కరోనా కేసు బాధితుడు కోలువడం కొంత ఊరట కలిగిస్తుంది. వేసవి సమీపిస్తున్నప్పటికీ వాతావరణం చల్లబడుతుండటంతో కరోనా వ్యాప్తికి అనుకూలంగా మారుతున్నది. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం కరోనాపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. టాలీవుడ్ హీరో, విజయ్ దేవరకొండతో కరోనా పై ప్రచార చిత్రాన్ని రూపొందించింది.
కొన్నాళ్లపాటు షేక్ హ్యాండ్ ను పక్కన పెట్టాలని.. ఎవరికైనా నమస్కారం పెట్టాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. పదేపదే ముక్కు, కళ్లను చేతులతో ముట్టుకునే ప్రయత్నం చేయకుండా చూసుకోవాలని సూచిస్తుంది. ప్రతీ గంటకు ఒకమారు చేతులు శుభ్రంగా కనుక్కోవాలని చెబుతుంది. దీని వల్ల కరోనా వైరస్ కు కొంత దూరంగా ఉండవచ్చని ప్రభుత్వం సూచిస్తుంది. విజయ్ దేవరకొండతో రూపొందిచిన ప్రచార చిత్రాన్ని కరోనా అవగాహన కోసం ప్రభుత్వం వినియోగిస్తుంది.
https://www.youtube.com/watch?v=Jb3YDdg9yvk