ఇంగ్లండ్ తో జరిగే 5 టీట్వంటీలకు టీమిండియా కష్టపడుతోంది. అహ్మదాబాద్ లోని మోడీ స్టేడియంలో తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లు బ్యాటింగ్ లో దుమ్ము రేపుతున్నారు. భారీ షాట్లు కొడుతున్న వీరి వీడియోలను బీసీసీఐ షేర్ చేసింది. అవిప్పుడు వైరల్ గా మారాయి.
కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ వెనుకాల నిలుచుండి చూస్తుండగా పాండ్యా బ్యాటింగ్ లో బంతులను స్టేడియం అవతలికి తరలిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. కోహ్లీ, శాస్త్రి సైతం అవాక్కయ్యేలా పాండ్యా దూకుడైన బ్యాటింగ్ ఆ వీడియోలో కనిపించింది.
ఇక పాండ్యా బ్యాటింగ్ మాత్రమే కాకుండా.. వెన్నుకు చికిత్స తర్వాత తొలిసారి బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో బౌలింగ్ చేయలేకపోయిన పాండ్యా తాజాగా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టడం విశేషం.
https://twitter.com/hardikpandya7/status/1369178329283055617?s=20
ఇక కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ సైతం బ్యాటింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఇద్దరూ పోటీ పోటీగా కసరత్తు చేస్తూ భారీ షాట్లు సాధన చేశారు.
టీమిండియా టీ20 ఆటగాళ్లంతా నెట్స్ లో భారీ షాట్లు సాధన చేస్తున్నారు. మిగతా ఆటగాళ్లు సైతం జోష్ లో కనిపించారు. రిషబ్ పంత్, కోహ్లీ సైతం భారీ షాట్లు ఆడుతున్న వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
https://twitter.com/BCCI/status/1369185231136116736?s=20