వకీల్ సాబ్ షూటింగ్ షూరూ అయ్యేది అప్పుడే..

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ను వెండితెరపై చూసి దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. చివరగా ‘అజ్ఞాతవాసి’గా ప్రేక్షకులకు కనిపించాడు పవన్‌. రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారిన తర్వాత సినిమాలకు దూరం అవుతున్నట్టు ప్రకటించిన పవర్ స్టార్.. తర్వాత మనసు మార్చుకున్నాడు. ఏకంగా మూడు సినిమాలకు ఓకే చెప్పాడు. వకీల్‌ సాబ్‌, జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలయ్యాయి. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ ఇంకో సినిమాను ప్రకటించారు. బాలీవుడ్ హిట్ మూవీ.. ‘పింక్‌’కు […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 4:17 pm
Follow us on


పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ను వెండితెరపై చూసి దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. చివరగా ‘అజ్ఞాతవాసి’గా ప్రేక్షకులకు కనిపించాడు పవన్‌. రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారిన తర్వాత సినిమాలకు దూరం అవుతున్నట్టు ప్రకటించిన పవర్ స్టార్.. తర్వాత మనసు మార్చుకున్నాడు. ఏకంగా మూడు సినిమాలకు ఓకే చెప్పాడు. వకీల్‌ సాబ్‌, జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలయ్యాయి. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ ఇంకో సినిమాను ప్రకటించారు.

బాలీవుడ్ హిట్ మూవీ.. ‘పింక్‌’కు రీమేక్‌ అయిన వకీల్ సాబ్‌కు వేణు శ్రీరామ్ డైరెక్టర్. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతాలు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తో పాటు ఫస్ట్‌ సింగిల్‌కు ఇప్పటికే విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. దాంతో, పవన్‌ను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు ఆత్రుతగా ఉండగా.. లాక్‌డౌన్‌ వారి ఆశలపై నీళ్లు కుమ్మరించింది. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల పాటు సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు అనుమతి ఇచ్చింది.షూటింగ్‌లకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉంది. జూన్‌ తొలివారం నుంచి షూటింగ్స్‌ తిరిగి ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థలు రెడీ అవుతున్నాయి.

కానీ, ఆ లిస్ట్‌లో వకీల్‌ సాబ్‌ లేకపోవడం పవన్‌ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశం. ఈ సినిమాకు సంబంధించి మరో ముప్పై రోజుల షూటింగ్ మిగిలుందని తెలుస్తోంది. అయితే, వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే చిత్రీకరణ తిరిగి మొదలు పెడదామని నిర్మాతలకు పవన్‌ చెప్పినట్టు సమాచారం. దాంతో, జూలై నుంచి షూటింగ్ షురూ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన వకీల్‌ సాబ్‌ రాక మరింత ఆలస్యం కానుంది.