https://oktelugu.com/

‘వకీల్ సాబ్‘ను హత్తుకున్న ‘కుటుంబం’.. తిరుగు లేదిక‌!

సినిమా క‌లెక్ష‌న్ల వ‌సూళ్లు కురిపించాల‌న్నా.. తిరుగులేని విజ‌యాన్ని న‌మోదు చేయాల‌న్నా.. అభిమానుల పోరాటం ఒక్క‌టే స‌రిపోదు. ఇత‌ర ప్రేక్ష‌కుల స‌హ‌కారం కూడా కావాలి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ స‌పోర్టు అందాలి. అది జ‌రిగిన‌ప్పుడే సినిమా అన్ని వ‌ర్గాల‌కూ చేరిన‌ట్టు లెక్క‌. అంద‌రినీ అల‌రించిన‌ట్టు లెక్క‌. ఇప్పుడు వ‌కీల్ సాబ్ విష‌యంలో ఇది సుస్ప‌ష్ట‌మవుతోంది. మూడేళ్ల త‌ర్వాత వ‌స్తున్న త‌మ హీరో సినిమా అంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదు. దీంతో.. భారీ ఓపెనింగ్స్ తో […]

Written By:
  • Rocky
  • , Updated On : April 14, 2021 / 01:46 PM IST
    Follow us on

    సినిమా క‌లెక్ష‌న్ల వ‌సూళ్లు కురిపించాల‌న్నా.. తిరుగులేని విజ‌యాన్ని న‌మోదు చేయాల‌న్నా.. అభిమానుల పోరాటం ఒక్క‌టే స‌రిపోదు. ఇత‌ర ప్రేక్ష‌కుల స‌హ‌కారం కూడా కావాలి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ స‌పోర్టు అందాలి. అది జ‌రిగిన‌ప్పుడే సినిమా అన్ని వ‌ర్గాల‌కూ చేరిన‌ట్టు లెక్క‌. అంద‌రినీ అల‌రించిన‌ట్టు లెక్క‌. ఇప్పుడు వ‌కీల్ సాబ్ విష‌యంలో ఇది సుస్ప‌ష్ట‌మవుతోంది.

    మూడేళ్ల త‌ర్వాత వ‌స్తున్న త‌మ హీరో సినిమా అంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదు. దీంతో.. భారీ ఓపెనింగ్స్ తో ఇండ‌స్ట్రీలోని పాత రికార్డుల‌ను తుడిచెపెట్టింది ‘వ‌కీల్ సాబ్‌’. పవన్ అభిమానులకు, ఇత‌ర యువ‌త తోడ‌వ‌డంతో ఫ‌స్ట్ వీక్ ను దున్నేసింది వ‌కీల్ సాబ్ మూవీ. వంద కోట్ల క్ల‌బ్ దిశ‌గా ప‌రుగులు పెడుతోంది. అయితే.. ఇప్ప‌టికే ప‌వ‌న్ ఫ్యాన్స్ మొత్తం దాదాపుగా సినిమా చూసేశారు.

    ఇప్పుడు ఫ్యామిలీ ఆడియ‌న్స్ వంతు వ‌చ్చింది. ‘వ‌కీల్ సాబ్’ సినిమా బాగుందని, మహిళల సమస్యలపై చర్చించిన విధానం బాగుందని టాక్ స్ప్రెడ్ అవ్వడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటి వారంలో వకీల్ సాబ్ బాధ్యతను ఫ్యాన్స్ తీసుకోగా.. సెకండ్ వీక్ నుంచి కుటుంబ ప్రేక్షకులు చూసుకుంటున్నారు. థియేటర్ల వద్ద మహిళా ప్రేక్షకులు క్యూ కట్టిన ఫొటోలు.. సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. దీంతో.. వారిని సినిమా ఎంత‌గా ఆక‌ట్టుకుందో అర్థ‌మ‌వుతోంద‌ని అంటున్నారు ఫ్యాన్స్‌.

    ఉగాది ప‌ర్వ‌దినం రోజున మ‌హిళ‌లు వ‌కీల్ సాబ్ సినిమాను ఎక్కువ‌గా చూశార‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో.. వ‌కీల్ సాబ్ ను ఫ్యామిలీస్ ఓన్ చేసుకున్నాయ‌నే విష‌యం తేలిపోయింద‌ని అంటున్నారు. మొత్తానికి.. ప‌వ‌న్ రీ-ఎంట్రీ బంబాట్ గా జ‌రిగిపోయింది. ఇక‌, ఈ వారం రావాల్సిన ల‌వ్ స్టోరీ, నెక్స్ట్ వీక్ రావాల్సిన ట‌క్ జ‌గ‌దీష్ వెన‌క్కు వెళ్లిపోవ‌డంతో.. ప‌వ‌న్ కు ఎదురే లేకుండా పోయింది. దీంతో.. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌న వ‌చ్చినా.. వ‌కీల్ సాబ్ కు న‌ష్టం లేద‌ని, రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ సాధించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.