దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు బైక్ లేదా స్కూటర్ ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడానికి వినియోగిస్తున్నారు. అయితే బైక్ లేదా స్కూటర్ ను నడిపే వాళ్లు ఇకపై సేఫ్టీ రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలి. వాహనదారులు సేఫ్టీ రూల్స్ ను పాటించని పక్షంలో ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. చాలామంది తాము సేఫ్టీ రూల్స్ ను అతిక్రమించబోమని భావిస్తూ ఉంటారు.
టూవీలర్ ను నడిపే వాళ్లు చిన్నచిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడితే జరిమానాల నుంచి సులభంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. కొత్త మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహనదారులు టూ వీలర్ కు రియల్ వ్యూ మిర్రర్స్ ను తీసేసినా భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. చాలామంది వాహనదారులు రియల్ వ్యూ మిర్రర్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. వాహనాలకు రియల్ వ్యూ మిర్రర్స్ లేనివాళ్లు వాటిని సెట్ చేసుకుంటే మంచిది.
టూ వీలర్లకు ఇండికేటర్లు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇండికేటర్లు లేకపోయినా భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక సర్వే ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న వాహన ప్రమాదాల్లో ఎక్కువ ప్రమాదాలు రియర్ వ్యూ మిర్రర్లు, ఇండికేటర్లు లేకపోవడం వల్ల కూడా జరుగుతున్నాయి. సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988లోని సెక్షన్ 5, 7 ప్రకారం టూవీలర్లకు రియల్ వ్యూ మిర్రర్లు కచ్చితంగా ఉండాలి.
లైసెన్స్ తో పాటు బండికి సంబంధించిన సర్టిఫికెట్లను వాహనదారులు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఎవరైతే వీటిని కలిగి ఉండరో వారు ట్రాఫిక్ పోలీసులు విధించే భారీ మొత్తం జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.