అత్యంత ప్రజాదరణ‘వకీల్ సాబ్‘ను హత్తుకున్న ‘కుటుంబం’.. తిరుగు లేదిక‌!

‘వకీల్ సాబ్‘ను హత్తుకున్న ‘కుటుంబం’.. తిరుగు లేదిక‌!

Vakeel Saabసినిమా క‌లెక్ష‌న్ల వ‌సూళ్లు కురిపించాల‌న్నా.. తిరుగులేని విజ‌యాన్ని న‌మోదు చేయాల‌న్నా.. అభిమానుల పోరాటం ఒక్క‌టే స‌రిపోదు. ఇత‌ర ప్రేక్ష‌కుల స‌హ‌కారం కూడా కావాలి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ స‌పోర్టు అందాలి. అది జ‌రిగిన‌ప్పుడే సినిమా అన్ని వ‌ర్గాల‌కూ చేరిన‌ట్టు లెక్క‌. అంద‌రినీ అల‌రించిన‌ట్టు లెక్క‌. ఇప్పుడు వ‌కీల్ సాబ్ విష‌యంలో ఇది సుస్ప‌ష్ట‌మవుతోంది.

మూడేళ్ల త‌ర్వాత వ‌స్తున్న త‌మ హీరో సినిమా అంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదు. దీంతో.. భారీ ఓపెనింగ్స్ తో ఇండ‌స్ట్రీలోని పాత రికార్డుల‌ను తుడిచెపెట్టింది ‘వ‌కీల్ సాబ్‌’. పవన్ అభిమానులకు, ఇత‌ర యువ‌త తోడ‌వ‌డంతో ఫ‌స్ట్ వీక్ ను దున్నేసింది వ‌కీల్ సాబ్ మూవీ. వంద కోట్ల క్ల‌బ్ దిశ‌గా ప‌రుగులు పెడుతోంది. అయితే.. ఇప్ప‌టికే ప‌వ‌న్ ఫ్యాన్స్ మొత్తం దాదాపుగా సినిమా చూసేశారు.

ఇప్పుడు ఫ్యామిలీ ఆడియ‌న్స్ వంతు వ‌చ్చింది. ‘వ‌కీల్ సాబ్’ సినిమా బాగుందని, మహిళల సమస్యలపై చర్చించిన విధానం బాగుందని టాక్ స్ప్రెడ్ అవ్వడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటి వారంలో వకీల్ సాబ్ బాధ్యతను ఫ్యాన్స్ తీసుకోగా.. సెకండ్ వీక్ నుంచి కుటుంబ ప్రేక్షకులు చూసుకుంటున్నారు. థియేటర్ల వద్ద మహిళా ప్రేక్షకులు క్యూ కట్టిన ఫొటోలు.. సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. దీంతో.. వారిని సినిమా ఎంత‌గా ఆక‌ట్టుకుందో అర్థ‌మ‌వుతోంద‌ని అంటున్నారు ఫ్యాన్స్‌.

ఉగాది ప‌ర్వ‌దినం రోజున మ‌హిళ‌లు వ‌కీల్ సాబ్ సినిమాను ఎక్కువ‌గా చూశార‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో.. వ‌కీల్ సాబ్ ను ఫ్యామిలీస్ ఓన్ చేసుకున్నాయ‌నే విష‌యం తేలిపోయింద‌ని అంటున్నారు. మొత్తానికి.. ప‌వ‌న్ రీ-ఎంట్రీ బంబాట్ గా జ‌రిగిపోయింది. ఇక‌, ఈ వారం రావాల్సిన ల‌వ్ స్టోరీ, నెక్స్ట్ వీక్ రావాల్సిన ట‌క్ జ‌గ‌దీష్ వెన‌క్కు వెళ్లిపోవ‌డంతో.. ప‌వ‌న్ కు ఎదురే లేకుండా పోయింది. దీంతో.. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌న వ‌చ్చినా.. వ‌కీల్ సాబ్ కు న‌ష్టం లేద‌ని, రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ సాధించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Pawan Kalyan: సర్జరీ తర్వాత తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చిన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..

Pawan Kalyan: రీసెంట్ గానే ముంబై లో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ , గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ లోని తన నివాసం లో విశ్రాంతి...

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...