https://oktelugu.com/

ఉప్పెన ట్రైలర్ టాక్: ప్రేమ ఎప్పుడూ చరిత్రయేనా?

గొప్ప ప్రేమలన్నీ విషాదంతోనే ముగిశాయి. ఓ లైలా మజ్నూ, దేవదాస్ పార్వతి- ముంతాజ్ -షాజహాన్ ఇలా ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే కలిసిపోయింది. ప్రేమికులు దూరమయ్యారు. ఓ విషాద ప్రేమ కథను సినిమా తీయడానికి సుకుమార్, ఆయన శిష్యుడు బుచ్చిబాబు ‘ఉప్పెన’ వస్తున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘ఉప్పెన’. ఈ ప్రేమకథా చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ తో రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. తమిళ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 4, 2021 / 04:43 PM IST

    Credit only to Mega Nephews !

    Follow us on

    గొప్ప ప్రేమలన్నీ విషాదంతోనే ముగిశాయి. ఓ లైలా మజ్నూ, దేవదాస్ పార్వతి- ముంతాజ్ -షాజహాన్ ఇలా ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే కలిసిపోయింది. ప్రేమికులు దూరమయ్యారు. ఓ విషాద ప్రేమ కథను సినిమా తీయడానికి సుకుమార్, ఆయన శిష్యుడు బుచ్చిబాబు ‘ఉప్పెన’ వస్తున్నారు.

    మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘ఉప్పెన’. ఈ ప్రేమకథా చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ తో రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నాడు.

    అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఉప్పెన’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు ‘నీ కళ్లు నీలి సముద్రం’, జలజల జలపాతం నువ్వూ ’ అంటూ యువత హృదయాలను కొల్లగొట్టాయి. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ప్రాణం పోసినట్టు ఈ అద్భుత ప్రేమ కావ్యానికి పాటలు అందించాడు.

    తాజాగా విడుదలైన ‘ఉప్పెన’ ట్రైలర్ ఒక హృద్యమైన ప్రేమకథ చివరకు విషాదంతంగా ఎలా మిగిలిందనేది కథగా మలిచారు. ఒక చేపలు పట్టే యువకుడు.. ఒక చదువుకున్న యువతితో ప్రేమలో పడి చివరకు వారి తండ్రి, బంధువుల చేతిలో చనిపోయాడు అనేలా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

    ఈ ట్రైలర్ ను ఎన్టీఆర్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని.. ‘ఆల్ ది బెస్ట్’ అంటూ ట్విట్టర్ లో ఎన్టీఆర్ విడుదల చేశారు. కరోనా లాక్ డౌన్ ముందే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అన్ని అడ్డంకులు అధిగమించి ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.