https://oktelugu.com/

తెలంగాణ వచ్చాకే నిరుద్యోగం పెరిగిందా..!

నిధులు.. నీళ్లు.. ఉద్యోగాల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం సాగింది. యావత్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. తెలంగాణలోని రాజకీయ నాయకులు వెనుకడుగు వేసిన సమయంలో యువతే ముందుండి పోరాటాన్ని సాగించింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రం యువతకు అన్యాయమే జరిగింది. ఏ ఉద్యోగాల కోసమే యువత తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేసిందో ఆ ఫలితం మాత్రం వారికి అందని ద్రాక్షగానే మారిందని అభిప్రాయం నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 15, 2020 4:52 pm
    Follow us on

    Telangana

    నిధులు.. నీళ్లు.. ఉద్యోగాల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం సాగింది. యావత్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. తెలంగాణలోని రాజకీయ నాయకులు వెనుకడుగు వేసిన సమయంలో యువతే ముందుండి పోరాటాన్ని సాగించింది.

    అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రం యువతకు అన్యాయమే జరిగింది. ఏ ఉద్యోగాల కోసమే యువత తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేసిందో ఆ ఫలితం మాత్రం వారికి అందని ద్రాక్షగానే మారిందని అభిప్రాయం నిరుద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

    Also Read:బీజేపీ జోష్.. టీఆర్ఎస్ సైలెన్స్..!

    టీఆర్ఎస్ రెండుసార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చినా నిరుద్యోగ యువతకు నిరాశే ఎదురైంది. నిధులు.. నీళ్లపై చూపిన శ్రద్ధ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో మాత్రం చూపలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఈక్రమంలోనే నిరుద్యోగుల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత మొదలైంది.

    మొన్నటి దుబ్బాక.. నిన్నటి గ్రేటర్ ఫలితాల్లో నిరుద్యోగులకు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. నిరుద్యోగులను ఆకట్టకునేలా 50వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే సీఎం ప్రకటనను తెలంగాణ యువత పెద్దగా నమ్మడం లేదని తెలుస్తోంది.

    సీఎం ఉద్యోగాల ప్రకటనపై తాజాగా ప్రొఫెసర్ కోదండ రాం స్పందించారు. తెలంగాణలో 2013-14లో నిరుద్యోగ రేటు 2.7 శాతం రేటు ఉంటే ఇప్పుడు 8శాతానికి పెరిగిందని తెలిపారు. జేఎల్ రిక్యూట్మెంట్ గానీ.. యూనివర్సిటీల్లో ఖాళీలుగానీ ప్రభుత్వం భర్తీ చేయలేదని తెలిపారు.

    Also Read: నోటిఫికేషన్ల వస్తాయని చెప్పినా.. తెలంగాణ యువత నమ్మట్లేదా?

    ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు ఉంటాయని.. దానికి ప్రత్యేకంగా కమిటీలు అవసరం లేదన్నారు. జోనల్ వ్యవస్థ ను సవరించాల్సిన అవసరం ఉందని.. పాత జోన్ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే ఇబ్బందులు వస్తాయని తెలిపారు.మూడేళ్లుగా టెట్ వేయలేదని టీచర్ పోస్టులు ఎలా భర్తీ చేస్తారో చెప్పాలన్నారు.

    ఎన్నికలు వస్తున్నాయని హడావిడిగా నోటిఫికేషన్లు అంటున్నారని.. అందుకే ఉద్యోగాల భర్తీ పై నమ్మకం లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మార్చిలోగా పరీక్షలు నిర్వహించాలని కోదండరాం డిమాండ్ చేశారు. మూడేళ్లుగా టీచర్లకు ప్రమోషన్లు లేవని.. 2018 నుంచి పీఆర్సీ పెండింగ్ లో ఉందని తెలిపారు.

    ఉద్యోగాల కోసం ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని కోరారు. ఉద్యోగాల భర్తీ వయోపరిమితి పెంచడంతోపాటు నామమాత్రపు ఫీజును నిర్ణయించాలని కోరారు. సీఎం కేసీఆర్ కు ఆంధ్ర కాంట్రాక్టుల జేబులు నింపడంపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో లేదని కోదండ రామ్ విమర్శించారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్