
తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్న వేళ కాళ్ల కింద భూమి కదులుతుండడంతో సీఎం కేసీఆర్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఇప్పటికే 50వేల ఉద్యోగాల ప్రకటన చేసి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఉద్యోగాలు లేక కేసీఆర్ సర్కార్ పై కారాలు మిరియాలు నూరుతున్న యువతను కేసీఆర్ కూల్ చేశాడు. వారిని చదువుల బాట పట్టించాడు. ఇప్పుడు పీఆర్సీ సహా డిమాండ్లు నెరవేరకపోవడంతో సర్కార్ పై వ్యతిరేకతతో ఉన్న ఉద్యోగులను చల్లబరిచే ప్రయత్నాలను కేసీఆర్ ప్రారంభించాడు.
Also Read: జగన్, కేసీఆర్ దెబ్బ: హైకోర్టు సీజేలే మారిపోయారే? ఏంటి కథ?
ఉద్యోగుల సమస్య పరిష్కారం దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈనెలాఖరుతో ముగియనున్న పీఆర్సీ గడువు నేేపథ్యంలో ఉద్యోగ సంఘాలను ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయ్యారు. ఈలోపే పీఆర్సీపై ప్రకటన చేసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా కేసీఆర్ ప్రభుత్వం 43శాతం ఫిట్ మెంట్ ప్రకటించింది. 2018 మే 18న తొలి పీఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇది ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదు. అతీగతీ లేదు. 2020 డిసెంబర్ నెలాఖరుకు గడువు విధించారు. ఈ గడువులోపు నివేదిక వచ్చి కొత్త పీఆర్సీని ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగులు ఆశ పడుతున్నారు. తాజాగా కేసీఆర్ పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.
Also Read: తుదిదశకు చేరుకున్న టీపీసీసీ ఎంపిక.. ఢిల్లీకి రేవంత్ రెడ్డి..!
ఇలా కేసీఆర్ సర్కార్ పై పీకలదాకా కోపంగా ఉన్న తెలంగాణలోని ప్రధాన నిరుద్యోగులు, ఉద్యోగులను కూల్ చేసే చర్యలు కేసీఆర్ చేపట్టారు. అయితే ఇప్పటికీ లేట్ అయ్యింది. దీంతో వారు కేసీఆర్ సర్కార్ పై కోపం తగ్గించుకుంటారా? లేదా అన్నది వేచిచూడాలి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్