నిమ్మగడ్డను చావుదెబ్బ తీసిన పెద్దిరెడ్డి..

చిత్తూరు, గుంటూరు జిల్లాలలో అంత పెద్దఎత్తున ఏకగ్రీవాలు ఎలా నమోదు అయ్యాయని ఎస్ఈసీ కలెక్టర్ల ను ప్రశ్నించారు. తాను ఆయా ప్రాంతాల్లో పర్యటించినా.. అత్యధిక ఏకగ్రీవాలు జరగడం రమేశ్ కుమార్ సీరియస్ గా ఉన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోనే అత్యధిక ఏకగ్రీవాలు నమోదైన గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పంచాయతీ ఏకగ్రీవాలను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు నిలిపివేయాలని ఎస్ఈసీ ఆ రెండు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్లు ఏకగ్రీవాల ప్రకటనను నిలిపివేశారు. మొదట్లో కాస్త […]

Written By: NARESH, Updated On : February 5, 2021 8:06 pm
Follow us on

చిత్తూరు, గుంటూరు జిల్లాలలో అంత పెద్దఎత్తున ఏకగ్రీవాలు ఎలా నమోదు అయ్యాయని ఎస్ఈసీ కలెక్టర్ల ను ప్రశ్నించారు. తాను ఆయా ప్రాంతాల్లో పర్యటించినా.. అత్యధిక ఏకగ్రీవాలు జరగడం రమేశ్ కుమార్ సీరియస్ గా ఉన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోనే అత్యధిక ఏకగ్రీవాలు నమోదైన గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పంచాయతీ ఏకగ్రీవాలను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు నిలిపివేయాలని ఎస్ఈసీ ఆ రెండు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్లు ఏకగ్రీవాల ప్రకటనను నిలిపివేశారు.

మొదట్లో కాస్త తడబడినా… ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగిస్తోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు, వేస్తున్న వ్యూహాలు చాలా వరకు ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇతర పార్టీలు ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఏకగ్రీవాలను తాము ప్రోత్సహించడం లేదన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేస్తున్న ప్రకటనలను గ్రామస్తులు పట్టించుకోవడం లేదు. తొలిదశలో పోలింగ్ నామినేషన్లు.. ఉపసంహరణ ప్రక్రియ ముగిసేసరికి ఏకగ్రీవాలు జోరుగా నమోదయ్యాయి.

తొలివిడతలో ఏపీలో 453 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లా, అత్యల్పంగా అనంతపురం జిల్లాలో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. అనంతపురంలో ఆరుచోట్ల స్థానికులు తమ సర్పంచులను పోటీ లేకుండా ఎన్నుకున్నారు. చిత్తూరు జిల్లాలో తొలివిడత మొత్తం 454 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో 96 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 358 పంచాయతీలకు ఈనెల 9న పోలింగ్ నిర్వహిస్తారు.

ఇక రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏక్రగీవం అయ్యాయి.తొలివిడతలో 337 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. 67 ఏకగ్రీవం అయ్యాయి. మూడు రాజధానులను నిరసిస్తూ.. 400 రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న ఈ జిల్లాలో చెప్పుకోదగ్గ ఏకగ్రీవాలు నమోదు అవ్వడం ప్రాధానత్య సంతరించుకుంది. అదే విధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో 46, కర్నూలులో 54 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

ఏపీలో ఏకగ్రీవాల జోరు.. ఎస్ఈసీ రమేశ్ కుమార్ వ్యూహాల విఫలం.. చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. మొదటి నుంచి ఏకగ్రీవాలు వ్యతిరేకిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్ని జిల్లాలలో పర్యటించారు. ఎక్కడా ఏక్రగీవాలను ప్రోత్సహించొద్దని అధికారులకు సూచించారు.ఇందులో భాగంగా మాట వినని వారిపై చర్యలకు సైతం సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఏకగ్రీవాలకు సీఎం జగన్ ముందస్తు చర్యలు.. మంత్రులను కో ఆర్డినేషన్ చేస్తూ.. రచించిన వ్యూహాలు ఫలించాయి. మొదటి విడతలో అనుకున్న దానికన్నా.. ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఏపీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సొంత జిల్లాలో అత్యధిక ఏకగ్రీవాలు నమోదవ్వడం చర్చనీయాంశం.. దీనివెనుక మంత్రి పెద్ది రెడ్డి హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నిమ్మగడ్డను దెబ్బకొట్టడానికే ఇలా చేశాడని అనుకుంటున్నారు. కాగా ఏకగ్రీవం అయిన జిల్లాల్లో ఉత్తర్వులు నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వానికి.. ఎస్ఈసీకి మరింత వైరం పెరిగినట్లు అర్థం అవుతోంది.