గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాల వర్షం కురిపిస్తోంది. ఒకదాని తరువాత ఒకటి, హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలకు వాగ్దానాలు ఇస్తోంది. దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఇచ్చిన షాక్‌తో టిఆర్‌ఎస్ సెట్ రైట్ అయిపోయి ఇలా ప్రజలను ఆకర్షించేందుకు ఆపసోపాలు పడుతోంది.
Also Read: ఇక బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్మాయం కాదా?
తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా బీఆర్ఎస్ పై వెబ్ పోర్టల్ ను ఆవిష్కరించి ప్రజలకు మేలు చేసేలా ఆన్ లైన్ భవన నిర్మాణ అనుమతులను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇక భవన నిర్మాణ అనుమతులు అన్నీ ఆన్ లైన్ లోనే సాగనున్నాయి. స్వీయ ధృవీకరణ చేస్తే చాలు టిఎస్-బిపాస్ లో ఇంటి పర్మిషన్ లభ్యమవుతుంది. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. ఇకపై భవనం మరియు లేఅవుట్ ఆమోదాలను పొందడం సులభం అని ప్రకటించారు. కొత్త టిఎస్-బిపాస్ చట్టం ప్రకారం.. 75 చదరపు గజాల వరకు మరియు ఏడు మీటర్ల ఎత్తు ఉన్న ప్లాట్లలో నివాస భవనాలకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని కేటీఆర్ తెలిపారు.
మునిసిపల్ పరిపాలనలో మార్పులు తెస్తూ గత సంవత్సరంలో కొత్త మునిసిపల్ చట్టం తీసుకొచ్చామని..పట్టణాల్లో తగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం టిఎస్-బిపాస్ చట్టం చేశామని కేటీఆర్ తెలిపారు.. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు పొందే ప్రక్రియలో ప్రజల ఇబ్బందులు, అవినీతిని పరిష్కరించడానికి ప్రభుత్వం 2015 లో మునిసిపాలిటీలలో అభివృద్ధి అనుమతి నిర్వహణ వ్యవస్థను (డిపిఎంఎస్) ప్రవేశపెట్టిందని కేటీఆర్ వివరించారు. డిపిఎంఎస్‌కు చట్టబద్ధమైన అధికారాలు ఇవ్వడానికి.. పారదర్శకతను పెంచడానికి స్వీయ-ధృవీకరణ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. ప్రజలను ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా.. బాధ్యతాయుతంగా పని చేయడానికి టిఎస్-బిపిఎఎస్‌ను తీసుకువచ్చామని తెలిపారు.
Also Read: వైరల్: జీహెచ్ఎంసీపై బీజేపీ ఓపెన్ ఆఫర్
అవినీతిలేని పారదర్శకంగా ఆన్‌లైన్ ఆమోదం ద్వారా ఇంటి అనుమతులు సింగిల్-విండో వ్యవస్థ లో మంజూరు అవుతాయన్నారు. ఇక నుంచి తెలంగాణలో భవన మరియు లేఅవుట్ ఆమోదాలను పొందడం సులభం అన్నారు.. 75 చదరపు గజాల పైన – 600 చదరపు గజాల లోపు (10 మీటర్ల వరకు ఎత్తు) ప్లాట్లలో నివాస భవనాలకు తక్షణ అనుమతి స్వీయ ధృవీకరణ ఆధారంగా ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు.
Also Read: మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
600 చదరపు గజాల కంటే ఎక్కువ ప్లాట్లలోని లేఅవుట్లు / భవనాలకు మరియు 21 రోజుల్లో 10 మీటర్ల ఎత్తుకు సింగిల్ విండో అనుమతి ఇస్తామన్నారు. ఒకవేళ ఏదైనా పట్టణ స్థానిక సంస్థ లేదా మునిసిపాలిటీ 21 రోజుల గడువును తీర్చలేకపోతే అనుమతి 22 వ రోజు ఆన్‌లైన్‌లో దరఖాస్తు దారుడికి ఇవ్వబడుతుందని కేటీఆర్ వివరించారు.