అత్త సొమ్ముడు అల్లుడు దానం చేసినట్టు ఇప్పుడు ప్రజలు పన్నుల ద్వారా సంపాదించిన సొమ్మును ప్రజాప్రతినిధులు తమ ప్రచార ఆర్భాటం కోసం ఖర్చు చేస్తున్న వైనం తాజాగా ఆర్టీఐ ద్వారా దరఖాస్తులో వెల్లడైంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 310 కోట్లను ప్రచారం కోసం ఖర్చు చేసిన వైనం నిగ్గు తేలింది.
Also Read: తెలంగాణ ప్రజలకు ఇది మరో వరం!
తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం సాధించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2014లో గద్దెనెక్కినప్పటి నుంచి 2018 వరకు తన నాలుగున్నరేళ్ల పాలనలో ప్రచారం కోసం ఎంత ఖర్చు చేశాడో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అవును భారీగానే కేసీఆర్ ప్రచారం కోసం ఖర్చు చేశారని తెలిసింది.
తెలంగాణ ప్రభుత్వం 2014-18 మధ్య వివిధ మాధ్యమాల్లో ప్రచారం కోసం రూ.310 కోట్లకు పైగా ఖర్చుచేసిన వైనం వెలుగుచూసింది. ఓ సంస్థ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయడంతో ఈ వివారాలు వెల్లడయ్యాయి.
Also Read: ఇక బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్మాయం కాదా?
విశేషం ఏంటంటే ఇందులో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికే ఏకంగా రూ.1 కోటి ఖర్చు అయినట్టు లెక్కలు చూపడం విశేషం. ఎంతైనా ధనిక రాష్ట్రం తెలంగాణ కదా.. ఆ మాత్రం ఖర్చు చేయకపోతే పరపతి ఏముంటుందని కాబోలు.. పాలకులు భారీగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్