జీవితంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరితో పోల్చుతుంటాం. ‘అరె వాడు ఫలానా వాడిలానే చేస్తున్నాడురా.. అరె వాడు ఫలానా వాడిని పోలి ఉన్నాడురా.. అబ్బా వాడి క్యారెక్టర్.. వీడి క్యారెక్టర్ సేమ్ రా..’ అని అంటుంటాం. ఇక రాజకీయాల్లోకి వచ్చేసరికి వెన్నుపోటు రాజకీయాలు.. నిలకడలేని స్నేహాలకు కేరాఫ్‌గా వ్యంగ్యంగా చంద్రబాబును అందరూ ఆడిపోసుకుంటారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
అయితే.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల పోరు రసవత్తరంగా నడుస్తోంది. ఎవరు గెలుస్తారనేది ఇంకా ఉత్కంఠనే కొనసాగుతోంది. చివరి ఓటు వరకు ఓటమిని అంగీకరించేది లేదంటున్న ప్రస్తుత ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్.. నిన్న చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి కలిగించాయి. ట్రంప్ పట్ల ఆ దేశ ప్రజల అభిప్రాయాలు, ఆదరాభిమానాలు ఎలా ఉన్నా… ప్రపంచం మాత్రం ఆయన్ని ఓ అబద్ధాలకోరుగానే చూస్తోంది. అయినా ట్రంప్ మాత్రం తన నైజాన్ని ఏ మాత్రం మార్చుకోవడం లేదు.
Also Read: అమెరికా అధ్యక్షుడిగా ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు?
అయితే.. ఎందుకో ఏమో కానీ.. ఇప్పుడు చంద్రబాబును కూడా ట్రంప్‌తో పోల్చుతున్నారు నెటిజన్లు. ఎందుకంటే చంద్రబాబులోనూ ట్రంప్ లక్షణాలే కనిపిస్తుంటాయి కాబట్టి. తన రాజకీయ అనుభవం, వయస్సుకు తగ్గట్టు బాబు వ్యవహరించడం లేదనే ఆరోపణలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబంతా డర్టీయిస్ట్ పొలిటీషియన్ లేరని కేసీఆర్ అన్న మాటలు జనంలోకి బాగా దూసుకెళ్లాయి. అనేక సందర్భాల్లో చంద్రబాబు కూడా తన స్థాయిని మరిచి చౌకబారు రాజకీయాలు చేశాడు.
Also Read: చంద్రబాబు బాటలో కేరళ సీఎం.. మోడీకి షాక్
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు మరోసారి తన నైజం బయటపెట్టాడు. స్థానిక సంస్థల ఎన్నికలకైతే కరోనా ఉంది గానీ, బడులు తెరవడానికి, విద్యార్థుల జీవితాలతో ఆడుకోడానికి లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కరోనాను కూడా తమ స్వార్థానికి వాడుకుంటున్న చరిత్ర వైసీపీకే దక్కుతుందని ఆయన ధ్వజమెత్తారు. అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమీక్ష సందర్భంగా చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయమై మాట్లాడే అర్హతే బాబుకు లేదనేది రాష్ట్ర ప్రజలతోపాటు ప్రత్యర్థి పార్టీల అభిప్రాయం. ఎందుకంటే బాబు హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండే. కానీ.. ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడేమో స్థానిక ఎన్నికలకు హడావుడి చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.