https://oktelugu.com/

చిరంజీవి, మోహన్ బాబుల గాలి తీసిన బాలయ్య.. హాట్ కామెంట్స్

‘తెలుగు సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండ్‌, సెలెబ్రెటీలం మేం అంటే మేము చిరంజీవి, మోహన్‌బాబు కొట్టుకున్నారు. ఈ విషయం గమనించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లేందుకు యత్నించారు. అయితే ఆయనకు సన్మానం చేయాల్సి ఉందని కొందరు చెప్పగానే తన పనులను పక్కన బెట్టి సన్మానం చేయడానికి ఆగారు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిజంగా ఎన్టీఆర్‌ అభిమాని’ అని బాలకృష్ణ అన్నారు.  ఆయిన ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 2:05 pm
    Follow us on

    Chiru, Balayya, Mohan Babu

    ‘తెలుగు సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండ్‌, సెలెబ్రెటీలం మేం అంటే మేము చిరంజీవి, మోహన్‌బాబు కొట్టుకున్నారు. ఈ విషయం గమనించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లేందుకు యత్నించారు. అయితే ఆయనకు సన్మానం చేయాల్సి ఉందని కొందరు చెప్పగానే తన పనులను పక్కన బెట్టి సన్మానం చేయడానికి ఆగారు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిజంగా ఎన్టీఆర్‌ అభిమాని’ అని బాలకృష్ణ అన్నారు.  ఆయిన ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తి విషయాలు మాట్లాడారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘వేదికమీదికెక్కిన ప్రతి ఒక్కరు మహానుభావుడు కాలేరు.. ఎన్టీఆర్‌ గొప్ప మహానుభావుడు. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మహాత్మగాంధీ, అంబేద్కర్‌ వంటి వారి తరువాత ఎన్టీఆర్‌ అంతగొప్పటి వ్యక్తి.  ఆలాంటి మహానుభావుడు నా తండ్రి అయినందుకు ఎంతో గర్వపడుతున్నా.ఆయన కడుపున పుట్టడం నా అదృష్టం’ అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

    Also Read: కాజల్ కమిట్మెంట్.. షాక్ అవుతున్న అభిమానులు..!

    ఇక తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘నిజాం కాలేజీలో  చదివేటప్పుడు ఎంతో మంది ఫ్రెండ్స్‌ అయ్యారు. వారిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేశ్‌, మాజీ ఎంపీ మధుయాష్కీతో స్నేహం ఏర్పడింది. ఆ కాలేజీలో మాదే చివరి బెస్ట్‌ బ్యాచ్‌. మాతో చదువుకున్నవారంతా ఇప్పుడు మంచి మంచి హోదాల్లో  ఉన్నారు.

    నాన్నగారి ప్రమేయం వల్లే చదువుకున్నాను. వాస్తవానికి నాకు చదువంటే ఇష్టం లేదు. అందులోని నాకు ఎక్కువగా హిస్టరీపై ఎక్కువగా ఇష్టం ఉండేది. అందుకే ఇప్పుడు హిస్టరీ సినిమాలు తీయగలుగుతున్నా’ అని అన్నారు.

    Also Read: ‘గుర్తుందా శీతాకాలం’లో మరో భామ ఎవరంటే?

    ఎన్టీఆర్.. టాలీవుడ్ పరిశ్రమ ఉన్నన్నీ నాళ్లు ఆయన ఉంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మూలస్థంభాల్లో ప్రథముడు.  సినిమాల్లో వెలుగు వెలిగి అనంతరం రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నటుడాయన.. అంతటి మహానుభావుడితో చిరంజీవి, మోహన్ బాబు పోల్చుకోవడం.. హోదాల కోసం కొట్టుకోవడంపై బాలక్రిష్ణ వేసిన సెటైర్లు ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి.