బీజేపీ కార్పోరేటర్లకు టీఆర్ఎస్ రూ.5 కోట్ల ఆఫర్: బండి సంజయ్ సంచలన ఆరోపణలు

టీఆర్ఎస్ పార్టీలో చేరాలంటూ బీజేపీ కార్పోరేటర్లకు అయిదు కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు గుప్పించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరతామంటోన్నా.. మేమే చేర్చుకోవటం లేదని బాంబు పేల్చారు.. టీఆర్ఎస్ మమల్ని గెలికితే మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటాం.. పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారులతో మా నాయకులను ప్రభావితం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. Also Read: […]

Written By: NARESH, Updated On : December 24, 2020 8:08 pm
Follow us on

టీఆర్ఎస్ పార్టీలో చేరాలంటూ బీజేపీ కార్పోరేటర్లకు అయిదు కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు గుప్పించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరతామంటోన్నా.. మేమే చేర్చుకోవటం లేదని బాంబు పేల్చారు.. టీఆర్ఎస్ మమల్ని గెలికితే మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటాం.. పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారులతో మా నాయకులను ప్రభావితం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

Also Read: కాంగ్రెసోళ్లు ఈ ఫొటో చూస్తే పండుగ చేసుకుంటారు

ఈ సందర్భంగా ఖమ్మం, వరంగల్, సిద్దిపేట కార్పొరేషన్లకు చెందిన టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరనున్నారని సంజయ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడినా కేసీఆర్ కు అహంకారం తగ్గలేదని బండి విమర్శించారు. గ్రేటర్ మేయర్ పీఠంకు వెంటనే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లను టీఆర్ఎస్ ప్రలోభ పెడుతోందని ఆరోపించారు.

పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలను గుర్తించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సత్వరమే రోహింగ్యాలు, సంఘ విద్రోహశక్తుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.

Also Read: బీజేపీ, జనసేన పొత్తుపై తిరుపతిలో సంచలన ప్రకటన చేసిన సోము వీర్రాజు

హైదరాబాద్ పాతబస్తీపై బండి సంజయ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలు, పాకిస్తానీలు బయటకు రావాలంటే ఏం చేయాలో తెలంగాణ సర్కార్ కు సూచించారు. నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, సంఘ విద్రోహశక్తులను గుర్తించాలంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని బండి సంజయ్ కోరారు. అలా చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేస్తారన్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్