కేసీఆర్ సంచలనం: ‘హైదరాబాద్’ పరిధి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమె

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేశారు. ఎవ్వరూ ఊహించని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించి రాజకీయవర్గాలు, మీడియాను ఆశ్చర్యపరిచారు. రాజకీయాల్లో చాణక్యుడు లాంటి కేసీఆర్ కర్ర విరగకుండా.. పాము చచ్చేలా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటారు. ఈక్రమంలోనే యువతలో పీకల్లోతు కోపం టీఆర్ఎస్ పై ఉంది. విద్యా, ఉద్యోగాలు ప్రకటించలేదని అందరూ బీజేపీకి మద్దతుగా ఉన్నారు. ఖచ్చితంగా హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ గెలుపు కష్టమేనన్న […]

Written By: NARESH, Updated On : February 21, 2021 8:14 pm
Follow us on

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేశారు. ఎవ్వరూ ఊహించని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించి రాజకీయవర్గాలు, మీడియాను ఆశ్చర్యపరిచారు.

రాజకీయాల్లో చాణక్యుడు లాంటి కేసీఆర్ కర్ర విరగకుండా.. పాము చచ్చేలా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటారు. ఈక్రమంలోనే యువతలో పీకల్లోతు కోపం టీఆర్ఎస్ పై ఉంది. విద్యా, ఉద్యోగాలు ప్రకటించలేదని అందరూ బీజేపీకి మద్దతుగా ఉన్నారు. ఖచ్చితంగా హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ గెలుపు కష్టమేనన్న భావన ఉంది. హైదరాబాద్ లోనే చాలా మంది మేధావులు, నిరుద్యోగులు, పట్టభద్రులు ఉన్నారు. ఉద్యోగాలులేక వారంతా ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఈ ఓడిపోయే సీటును పీవీ కూతురుకు కేసీఆర్ఇచ్చారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పట్టభద్రుల్లో అధికార టీఆర్ఎస్ పోటీచేయకపోతే తీరని అవమానం. అందుకే పోటీకి టీఆర్ఎస్ తరుఫున ఏకంగా కాంగ్రెస్ మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కూతురు సురభి వాణిదేవిని పోటీకి దింపడం అందరినీ షాక్ కు గురిచేసింది. మరోవైపు కాంగ్రెస్ మాజీ ప్రధాని కూతురు వాణిదేవి పోటీచేస్తున్నట్టు టీఆర్ఎస్ ప్రకటించడం.. కాంగ్రెస్ నోట్లో పచ్చివెలక్కాయ పడ్డట్టు అయ్యింది.

టీఆర్ఎస్ అధికారికంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కూతురు వాణిదేవిని ప్రకటించింది. వాణిదేవి రేపు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు.హైదరాబాద్ విషయంలో పోటికి దిగరని అనుకున్నా పీవీ కుమార్తెను బరిలో దించడం విశేషంగా మారింది.

తెలంగాణ సీఎంగా కేసీఆర్ అయ్యాక పీవీకి అమిత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ట్యాంక్ బండ్ ఒడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయతలపెట్టారు.

ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 23వ తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 14న 799 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులకు ఓటింగ్ నిర్వహిస్తారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పరిధిలో 5.60 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు.