టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మృతితో నాగార్జున్ సాగర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో జరుగబోయే ఈ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఫోకస్ పెట్టాయి.
దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాల్లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగలడంతో నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి మంచి పట్టు ఉండటంతో బీజేపీ నేతలు ఆయనను పార్టీలోకి లాగేందుకు యత్నిస్తున్నారు. జానారెడ్డికి గవర్నర్ పదవీ ఇచ్చి ఆయన తనయుడికి అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు బీజేపీ రెడీ అవుతోంది.
అయితే జానారెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతారా? లేరా అనేది తేలాల్సి ఉంది.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ మాత్రం దుబ్బాక ఫలితం నేపథ్యంలో నాగార్జున్ సాగర్లో నోముల నర్సింహాయ్య కుటుంబాలనికి టిక్కెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది.
ఈ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమూర్తి యాదవ్ మనవడు టిఆర్ఎస్ యువనేత మన్యం రంజిత్ యాదవ్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోటీకి దింపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
రామ్మూర్తి యాదవ్ కు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. ఈ ప్రాంతంలో యాదవ సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. దీంతో రంజిత్ యాదవ్ కే సీటు కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నారని టాక్ విన్పిస్తోంది.
టిఆర్ఎస్ లోని మెజారిటీ నేతలు సైతం రంజిత్ యాదవ్ కే మద్దతు తెలుపుతుండంతో సీఎం కేసీఆర్ సైతం రంజిత్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.