మహేష్ బాబుతో కలిసి ‘మహర్షి’ మూవీ చేసిన అల్లరి నరేశ్ లోని అమాయకత్వం, కామెడీ సెన్స్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే యంగ్ కామెడీ హీరోగా ఒకనాటి రాజేంద్రప్రసాద్ ను అల్లరి నరేశ్ గుర్తుచేస్తున్నాడు. ఆయన సినిమాలకు పెద్దగా కథ లేకున్నా కామెడీతోనే లాగించేసిన సందర్భాలు ఉన్నాయి.
Also Read: సురేఖా వాణిని ఈ ఫొటో చూశాక ఆంటీ అని అనరు
మహర్షి సినిమా తర్వాత మంచి కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ కామెడీ సినిమాలను తగ్గించేసిన అల్లరి నరేశ్ తాజాగా ‘బంగారు బుల్లోడు సినిమాతో మళ్లీ మన ముందుకు వస్తున్నాడు.
ఆడవారి సమస్యలు, బంగారం దుకాణం అందులో అల్లరి నరేశ్ ఇతివృత్తంగా తాజాగా రిలీజ్ అయిన ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్ నవ్వులు పూయిస్తోంది.
Also Read: అభిమానులకు బ్రేకింగ్ న్యూస్ చెప్పిన ‘ఆర్ఆర్ఆర్’
ఓ బ్యాంకులో పనిచేసే అల్లరి నరేశ్ జనాలు బంగారం తాకట్టు పెడితే దాన్ని తీసుకొని ఆడవారికి అద్దెకు ఇస్తూ.. వ్యవసాయ లోన్లుగా తీసుకుంటూ పబ్బం గడుపుకుంటాడు. దీంతో అతడు పడే బాధలు, ఇబ్బందులు ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్