ట్రాఫిక్ ఎస్ఐ ఫోన్ విరగ్గొట్టి నడిరోడ్డుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం

అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం సృష్టించాడు. తన అనుచరుడిని ఆపిన ట్రాఫిక్ పోలీస్ పై శివాలెత్తాడు. విధులు నిర్వహిస్తున్న ఎస్ఐతో గొడవ పెట్టుకున్నాడు.అంతేకాదు ఆయన మొబైల్ ఫోన్ లాక్కొని విసరగొట్టాడు. హైదరాబాద్ శివారులో జరిగిన ఈ ఘటన వైరల్ అయ్యింది. హైదరాబాద్ శివారు దూలపల్లి నుంచి కొంపల్లి వైపు ఓ వాహనం రాంగ్రూట్ లో రాగా విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ వాహనాన్ని అడ్డుకున్నాడు. డ్రైవర్ ను కిందకు దింపి అడిగే తాను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు […]

Written By: NARESH, Updated On : March 4, 2021 6:32 pm
Follow us on

అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం సృష్టించాడు. తన అనుచరుడిని ఆపిన ట్రాఫిక్ పోలీస్ పై శివాలెత్తాడు. విధులు నిర్వహిస్తున్న ఎస్ఐతో గొడవ పెట్టుకున్నాడు.అంతేకాదు ఆయన మొబైల్ ఫోన్ లాక్కొని విసరగొట్టాడు. హైదరాబాద్ శివారులో జరిగిన ఈ ఘటన వైరల్ అయ్యింది.

హైదరాబాద్ శివారు దూలపల్లి నుంచి కొంపల్లి వైపు ఓ వాహనం రాంగ్రూట్ లో రాగా విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ వాహనాన్ని అడ్డుకున్నాడు. డ్రైవర్ ను కిందకు దింపి అడిగే తాను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మనిషినని.. నన్నే అడ్డుకుంటావా? అని మండిపడ్డారు.

వెంటనే ఎమ్మెల్యేకు సదురు వ్యక్తి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హనుమంతరావుకు తెలుపగా ఎమ్మెల్యే వీరావేషంతో అక్కడికి వచ్చాడట.. ఎస్ఐ దగ్గరకు వెళ్లి గొడవపడ్డాడట.. ఎస్ఐను తిట్టాడట.. ఎస్ఐ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్ఐ ఫోన్ లో వీడియో తీయడంతో ఆ ఫోన్ లాక్కొని ఎమ్మెల్యే హనుమంతరావు విరగొట్టాడు.

అనంతరం ఎస్ఐ తీరుకు నిరసనగా రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపాడు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఉన్నతాధికారులు వచ్చి సర్ధిచెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం ఎస్ఐ పేట్ బషీరాబాద్ పోలీసులకు
ఫిర్యాదు చేశాడు. విధులకు ఆటంకం పరిచాడని.. ఫోన్ పగులగొట్టాడని ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగంపై పలువురు మండిపడుతున్నారు.