2021 సంవత్సరంలో బంగారం, వెండి ధరలు అంతకంతకూ పతనమవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెల 5వ తేదీన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్ మార్కెట్ లో 52,360 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం ఆ ధర 45,600 రూపాయలుగా ఉంది. 60 రోజుల వ్యవధిలో బంగారం ధర ఏకంగా 6,760 రూపాయలు తగ్గడం గమనార్హం. ధరలు తగ్గుతుండటంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
Also Read: అలా చేస్తే రూ.75కే పెట్రోల్.. ఆర్థికవేత్తలు ఏం చెప్పారంటే..?
60 రోజుల వ్యవధిలో బంగారం ధర ఏకంగా 6,760 రూపాయలు తగ్గడం గమనార్హం. మార్కెట్ వర్గాల నిపుణులు బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైతే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు. మరోవైపు బంగారంపై ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య కూడా అంతకంతకూ తగ్గుతోందని తెలుస్తోంది. ఇప్పటివరకు గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసినవాళ్లు ప్రస్తుతం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు.
Also Read: రెడ్ మీ 10 ఫోన్స్ లాంచ్.. అద్భుత ఫీచర్లు.. వివరాలివే..!
బంగారంపై పెట్టుబడులు అంతకంతకూ తగ్గుతుండటం ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర 650 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,800కు చేరుకుంది. కిలో వెండి ధర ఏకంగా 2,400 రూపాయలు తగ్గడంతో రూ.70,400 చేరుకుంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం కూడా ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్ కు 0.29 శాతం తగ్గుదలతో 1710 డాలర్లకు క్షీణించగా వెండి ధర 0.73 శాతం తగ్గుదలతో 26.20 డాలర్లకు చేరింది.