https://oktelugu.com/

చివరి అంకానికి చేరిన టీపీసీసీ ఎంపిక.. రేసులో ఆ ఇద్దరు ఎంపీలు?

తెలంగాణలో కాంగ్రెస్ ను గాడినపెట్టే నాయకుడి కోసం అధిష్టానం గత రెండేళ్లు వెతుకుతోంది. అయితే ఆ పార్టీ నేతలే అధిష్టానంపై ధిక్కార స్వరం విన్పిస్తుండటంతో కొత్త టీపీసీసీ ఎంపిక ప్రతీసారి వాయిదా పడుతూ వస్తోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ దారుణ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే..! Also Read: మొత్తానికి మోడీషాలను కేసీఆర్ శరణు వేడాడా? ఈ పదవీపై ఎప్పటి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 12, 2020 / 09:52 AM IST
    Follow us on


    తెలంగాణలో కాంగ్రెస్ ను గాడినపెట్టే నాయకుడి కోసం అధిష్టానం గత రెండేళ్లు వెతుకుతోంది. అయితే ఆ పార్టీ నేతలే అధిష్టానంపై ధిక్కార స్వరం విన్పిస్తుండటంతో కొత్త టీపీసీసీ ఎంపిక ప్రతీసారి వాయిదా పడుతూ వస్తోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ దారుణ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే..!

    Also Read: మొత్తానికి మోడీషాలను కేసీఆర్ శరణు వేడాడా?

    ఈ పదవీపై ఎప్పటి నుంచి ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్లంతా అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. టీపీసీసీ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఓ సర్వే చేసినట్లు సమాచారం. తీరా టీపీసీసీని ప్రకటించేందుకు సిద్ధమైన తరుణంలో కాంగ్రెస్ సీనియర్లు పక్కచూపులు చూస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయ సేకరణ అనే పాచికవేసి నేతలను కట్టడి చేస్తోంది.

    ఈమేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ గత రెండ్రోజులుగా హైదరాబాద్లో తిష్టవేసి కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. శుక్రవారం సైతం అన్ని జిల్లాల అధ్యక్షులు.. టీపీసీసీ కార్యదర్శులు.. ప్రధాన కార్యదర్శులు.. ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులతో నుంచి ఠాకూర్ గాంధీ భవన్లో విడివిడిగా భేటీ అయి వారి అభిప్రాయాలను తీసుకున్నారు.

    ఈమేరకు నిన్నటితో అభిప్రాయ సేకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. నేడు మాణిక్యం ఠాకూర్ ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. దీనిపై అధిష్టానం కసరత్తులు చేసి ఈనెల 15లోగా కొత్త టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ రేసు చివరి దశకు చేరుకోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.

    Also Read: జగన్ పై కేంద్రానికి కేసీఆర్ ఫిర్యాదు: సానుకూలం తెలిపిన జలశక్తి మంత్రి..!

    టీపీసీసీ చీఫ్ పదవీపై సీనియర్లందరూ ఆశలు పెట్టుకున్న తుది రేసులో మాత్రం ఆ ఇద్దరి ఎంపీ పేర్లే ప్రముఖంగా విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అందరికీ కంటే ముందున్నాడు. ఇక ఆయన తర్వాత రేసులో నల్లొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.

    మెజార్టీ నేతల అభిప్రాయాల నేతల అభిప్రాయాలను పరిణగలోకి తీసుకొని టీపీసీసీ ఎంపిక ఉంటుందని అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనని చెబుతోంది. దీంతో వీరిద్దరిలో ఒకరికి టీపీసీసీ దక్కడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. రెండేళ్లుగా టీపీసీసీ నియామకంపై ఊరిస్తున్న కాంగ్రెస్ ఎట్టకేలకు ప్రకటన చేసేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తిని రేపుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్