https://oktelugu.com/

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. అది నిజమే !

జూనియర్ ఎన్టీఆర్ నటనా చాతుర్యం గురించి, ఆయన వాగ్దాటి గురించి కొత్తగా చెప్పుకునేది ఏమి లేదు. మాములు డైలాగ్ ను కూడా తన నోటితో చెప్పి విశేషమైన విజయ తీరాలకు చేర్చగల గొప్ప మాటకారి ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ ను ఎన్నడూ లేని స్థాయిలో ఉరూతలు ఊగించింది. కాగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరోసారి సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ రానుంది. టెలివిజన్ షోలో జూనియర్ ఎన్టీఆర్ […]

Written By:
  • admin
  • , Updated On : December 12, 2020 / 09:47 AM IST
    Follow us on


    జూనియర్ ఎన్టీఆర్ నటనా చాతుర్యం గురించి, ఆయన వాగ్దాటి గురించి కొత్తగా చెప్పుకునేది ఏమి లేదు. మాములు డైలాగ్ ను కూడా తన నోటితో చెప్పి విశేషమైన విజయ తీరాలకు చేర్చగల గొప్ప మాటకారి ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ ను ఎన్నడూ లేని స్థాయిలో ఉరూతలు ఊగించింది. కాగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరోసారి సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ రానుంది. టెలివిజన్ షోలో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి కనిపించబోతున్నారని.. తారక్ ఒక షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి అంగీకరించాడని టాక్ నడుస్తోంది.

    Also Read:  అంచెలంచెలుగా ఎదిగిన ‘తలైవా’..: నేడు రజనీ పుట్టిన రోజు..

    జెమిని టీవీ చానెల్ నిర్వహించబోయే ఆ సరికొత్త షో కోసం ఇప్పటికే అన్నపూర్ణలో రెండు ఫ్లోర్లను కూడా బుక్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. పైగా భారీ సెట్ లో షూటింగ్ నిర్వహించబోతున్నారట. దాదాపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా చివరి దశలోకి రావడం, పైగా ఎన్టీఆర్ కు సంబంధించిన మేజర్ సీన్స్ అన్ని ఫినిష్ అవ్వడంతో.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఫ్రీ అయినట్టు.. అందుకే షోకి ఒప్పుకున్నట్లు సమాచారం. నిజానికి బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఆల్ మోస్ట్ తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. గతంలోనే అనేక రకాల రూమర్స్ వచ్చాయి.

    Also Read: నో ఎట్టి పరిస్థితుల్లో ముద్దు పెట్టాల్సిందే !

    దానికి తగ్గట్లుగానే బిగ్ బాస్ బృందం కూడా ఎన్టీఆర్ కోసం బాగానే ప్రయత్నాలు చేసింది, కానీ, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా పనుల్లో అప్పుడు బిగ్ బాస్ చేయడానికి అంగీకరించలేదు. ఇక ఇప్పుడు ఫ్రీ అవ్వడం, పైగా జెమిని టీవీ భారీగా ప్లాన్ చేయడంతో తారక్ హోస్ట్ గా చేయడానికి ఒప్పుకున్నాడట. మరి బిగ్ బాస్ సీజన్ 1తో అదరగొట్టిన జూనియర్ ఇప్పుడు మరింతగా ఆకట్టుకోవడం ఖాయం. చూడాలి ఈ షో ఎలా ఉండబోతుందో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్