https://oktelugu.com/

దయచేసి పార్టీ అడగొద్దంటున్న కాజల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితా తీస్తే అందులో కాజల్ అగర్వాల్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఈమధ్యకాలంలో ఏ కథానాయకికీ లేని ట్రాక్ రికార్డ్ కాజల్ సొంతం. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగింది ఆమె. ఈ నటికి అయినా స్టార్ హీరోయిన్ స్టేటస్ మహా అయితే ఆరేడేళ్లకి మించి ఉండదు. కానీ కాజల్ మాత్రం ఏకధాటిగా 10 ఏళ్లకు పైగానే స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది. ఇప్పటికీ ఆమె ఆ స్థాయిలోనే ఉంది. Also Read: […]

Written By: , Updated On : October 28, 2020 / 07:01 PM IST
Follow us on

Kajal says no to the party
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితా తీస్తే అందులో కాజల్ అగర్వాల్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఈమధ్యకాలంలో ఏ కథానాయకికీ లేని ట్రాక్ రికార్డ్ కాజల్ సొంతం. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగింది ఆమె. ఈ నటికి అయినా స్టార్ హీరోయిన్ స్టేటస్ మహా అయితే ఆరేడేళ్లకి మించి ఉండదు. కానీ కాజల్ మాత్రం ఏకధాటిగా 10 ఏళ్లకు పైగానే స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది. ఇప్పటికీ ఆమె ఆ స్థాయిలోనే ఉంది.

Also Read: ఎన్టీఆర్ ముస్లిం గెటప్ తీయడం కుదరదట

సౌత్ పరిశ్రమలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ ఆమె సినిమాలు చేసేసింది. ఇప్పుడు కూడ ఆమె చేతిలో చిరంజీవి, కమల్ హాసన్ చిత్రాలున్నాయి. ఇలా స్టార్ స్టేటస్ ఉండగానే పెళ్లి పీఠలెక్కాలని డిసైడ్ అయింది ఈ చందమామ. ఈ నెల 31న గౌతమ్ కిచ్లూతో ఆమె వివాహం జరగనుంది. మాములుగా అయితే కాజల్ పెళ్లంటే భారీ హంగామానే ఉండేది. కానీ కోవిడ్ కారణంగా ఈ వివాహం చాలా లో ప్రొఫైల్లో జరగనుంది. కేవలం 20 నుండి 30 మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరవుతారు.

Also Read: మహేష్ పెట్టుడు మీసం మీద కామెంట్ చేసిన నమ్రత

అందుకే కాజల్ సన్నిహితులు ఎలాగూ పెళ్ళికి రావట్లేదు కాబట్టి పెద్ద ప్రీ వెడ్డింగ్ పార్టీ అడుగుతున్నారట. కానీ కాజల్ నో చెబుతోందట. కోవిడ్ సమస్య మూలాన పెళ్లినే తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకుంటుంటే పార్టీ ఎలా ఇస్తాను. అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు అందుకే పార్టీల్లాంటివి ఏమీ లేవని, అడగొద్దని స్నేహితులకు సర్దిచెబుతోందట కాజల్.