టీపీసీసీ చీఫ్ ఎవరో ముందే ఫిక్స్ అయిందా.. మరీ అభిప్రాయ సేకరణ సంగతెంటీ?

కాంగ్రెస్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాడు. ఈ పదవీని దక్కించుకునేందుకు కాంగ్రెస్ లోని సీనియర్లంతా పోటీ పడుతున్నారు. తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. Also Read: కోదండరాం ఎందుకు సైలంట్ అయ్యారు.. బరిలో నిలిచేనా? టీపీసీసీ చీఫ్ పదవీని ఎంపీ రేవంత్ రెడ్డికి కట్టబెట్టాలని […]

Written By: Neelambaram, Updated On : December 12, 2020 1:42 pm
Follow us on

కాంగ్రెస్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాడు. ఈ పదవీని దక్కించుకునేందుకు కాంగ్రెస్ లోని సీనియర్లంతా పోటీ పడుతున్నారు. తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది.

Also Read: కోదండరాం ఎందుకు సైలంట్ అయ్యారు.. బరిలో నిలిచేనా?

టీపీసీసీ చీఫ్ పదవీని ఎంపీ రేవంత్ రెడ్డికి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే కాంగ్రెస్ లోని సీనియర్లు రేవంత్ ను వ్యతిరేకిస్తుండటంతో అధిష్టానం పార్టీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతోంది. గత రెండ్రోజులుగా గాంధీ భవనల్లో వివిధ జిల్లాల నేతలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ సమావేశమై వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు.

ఈమేరకు తొలిరోజంతా కోర్ కమిటీ సభ్యుల తమ అభిప్రాయాలు ఠాకూర్ కు విన్నవించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎదిగిన వారికే పీసీసీ ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. టీపీసీసీపై ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. జగ్గారెడ్డి.. అంజన్ కుమార్ యాదవ్.. మధుయాష్కీ.. భట్టి విక్రమార్క.. దామోదర రాజానర్సింహాలు తమకే పీసీసీ ఇవ్వాలని ఠాకూర్ ను కోరినట్లు తెలుస్తోంది.

ములుగు ఎమ్మెల్యే సీతక్క మినహాయించి మిగతా సీనియర్లంతా తమకు పీసీసీ ఇవ్వకుంటే కాంగ్రెస్ లోని సీనియర్ నేతలకు ఇవ్వాలని ఠాకూర్ ను కోరినట్లు తెలుస్తోంది. టీపీసీసీ ఎప్పుడూ రెడ్డి సామాజిక వర్గానికేనా బీసీలకు ఇవ్వారా? అంటూ మాజీ ఎంపీ పొన్నాల ప్రభాకర్.. వి.హన్మంతరావులు ఠాకూర్ ను గట్టిగానే అడిగినట్లు తెలుస్తోంది.

Also Read: బీజేపీలోకి మాజీ మంత్రి.. చేరికలకు రంగం సిద్ధం?

కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ అభిప్రాయ సేకరణపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయ సేకరణలోనూ కొందరు ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. కాగా ఢిల్లీ పెద్దలు ఇప్పటికే టీపీసీసీపై నిర్ణయానికి వచ్చారని.. ఈ అభిప్రాయ సేకరణ ఒట్టి బోగస్ అంటూ మరికొందరు ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్ సీనియర్లు నేతలను బుజ్జగించేందుకే అధిష్టానం అభిప్రాయం సేకరణ ఎత్తుగడ వేసిందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా కాంగ్రెస్ అధిష్టానం కిందిస్థాయిలోని నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటా? లేదా ఎప్పటిలాగే సోనియాగాంధీ నిర్ణయమే ఫైనల్ కానుందా? అనేది మాత్రం తేలాల్సి ఉంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్