
కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదనడం కేసీఆర్ అవివేకం అన్నారు తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేశారు మధు యాష్కీ. స్వార్ధ రాజకీయ లాభం కోసం తెలంగాణ అన్నది కేసీఆర్, నీ అవినీతి బయట పడే రోజులు దగ్గర పడ్డాయి అని మధు యాష్కీ విమర్శించారు. యూనివర్సిటీ లో వైస్ చాన్సలర్ లేరు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సిద్దిపేటలో కట్టి జన్మ ధన్యం అయ్యింది అనుకుంటున్నారు. మిగిలిన 8 లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని మధు యాష్కీ ప్రశ్నించారు..