బాలీవుడ్లోకి క్యూ కడుతున్న టాలీవుడ్ సినిమాలు..!

ఒక సినిమా హిట్టు కావాలంటే దాని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. సినిమా తీయడానికి కావాల్సింది ముందుగా బలమైన కథ. ఆ తర్వాతే నటీనటులన్న సంగతీ ప్రతీఒక్కరికీ తెల్సిందే. ఇటీవల కాలంలో రచయితలంతా దర్శకులుగా మారుతుండటంతో ఇండస్ట్రీలో కథల కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి కథలకు ఫుల్ డిమాండ్ ఉంది. అయితే డిమాండ్ కు తగ్గ సప్లయ్ మాత్రం లేకపోవడంతో దర్శక, నిర్మాతలంతా రీమేక్ సినిమాలపై దృష్టిసారిస్తున్నారు. ఇతర భాషల్లో హిట్టయిన సినిమాలను కొన్ని […]

Written By: NARESH, Updated On : November 30, 2020 4:40 pm
Follow us on

ఒక సినిమా హిట్టు కావాలంటే దాని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. సినిమా తీయడానికి కావాల్సింది ముందుగా బలమైన కథ. ఆ తర్వాతే నటీనటులన్న సంగతీ ప్రతీఒక్కరికీ తెల్సిందే. ఇటీవల కాలంలో రచయితలంతా దర్శకులుగా మారుతుండటంతో ఇండస్ట్రీలో కథల కొరత ఏర్పడుతోంది.

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి కథలకు ఫుల్ డిమాండ్ ఉంది. అయితే డిమాండ్ కు తగ్గ సప్లయ్ మాత్రం లేకపోవడంతో దర్శక, నిర్మాతలంతా రీమేక్ సినిమాలపై దృష్టిసారిస్తున్నారు. ఇతర భాషల్లో హిట్టయిన సినిమాలను కొన్ని మార్పులు చేసి ఆయా ఇండస్ట్రీలో హిట్టు కొడుతున్నారు.

స్టార్ హీరోలు సైతం రీమేక్ సినిమాలకు ఏమాత్రం అడ్డుచెప్పకపోవడంతో ఇటీవల అన్ని ఇండస్ట్రీల్లోనూ రీమేక్ ల హవా కొనసాగుతోంది. టాలీవుడ్లోకి మాలయాళం.. తమిళం.. కన్నడ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. అదేవిధంగా టాలీవుడ్లో సూపర్ హిట్స్ సాధించిన సినిమాలన్నీ కూడా బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి.

ఇప్పటికే టాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్స్ నిలిచిన పలు సినిమాలు బాలీవుడ్లోకి రీమేక్ అయి సూపర్ హిట్స్ గా నిలిచాయి. కండలవీరుడు సల్మాన్ ఖాన్.. అజయ్ దేవగణ్.. అక్షయ్ కుమార్ వంటి బడా స్టార్స్ టాలీవుడ్ సినిమాలను ఎప్పటికప్పుడు రీమేక్ చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. దీంతో మిగతా బాలీవుడ్ హీరోలు సైతం టాలీవుడ్ సినిమాలపై దృష్టిసారిస్తున్నారు.

ఈక్రమంలో టాలీవుడ్లో సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన పలు సినిమాలు బాలీవుడ్లోకి తాజాగా పయనమవుతోన్నాయి. ప్రభాస్-రాజమౌళి కాంబినోషన్లలో వచ్చిన ‘ఛత్రపతి’.. జూనియర్ ఎన్టీఆర్ ‘ఉసరవెల్లి’.. అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’.. ఎస్పీబీ నటించిన ‘మిథునం’ సినిమాలు బాలీవుడ్లోకి రీమేక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు మరిన్ని టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ బాటకు పయనమయ్యేలా కన్పిస్తున్నాయి.