మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఎన్నో ప్రయాణ సాధనాలు ఉన్నా ఆ ప్రయాణ సాధనాలలో సైకిల్ ఎంతో అద్భుతమైనది అని చెప్పవచ్చు. సైకిల్ పై ప్రయాణించడం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సైకిల్ పై ప్రయాణం ద్వారా సామాజిక దూరం పాటించవచ్చు. సైకిల్ శరీరానికి వ్యాయామంలా ఉపయోగపడటంతో పాటు బ్లడ్ ప్రెజర్ ను దూరం చేస్తుంది.
Also Read: గుడ్డు పెంకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
రకపోటు సమస్యతో బాధ పడే వాళ్లకు జాగింగ్ కంటే సైకిల్ తొక్కటం ఎంతో మంచిది. సైకిల్ తొక్కాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలా శ్రమించడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చు కావడంతో పాటు సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. రోజూ సైకిల్ తొక్కేవాళ్లలో శరీరానికి వెనుక భాగంలో ఉండే మజిల్స్ పటిష్టంగా తయారవుతాయి. సైకిల్ తొక్కడం ద్వారా నడకలో కంటే ఎక్కువ కండరాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
Also Read: మధుమేహ రోగులు కొబ్బరినీళ్లు తాగవచ్చా..? తాగకూడదా..?
ఎక్కువ కండరాలను ఉపయోగించడం వల్ల శరీరానికి సైతం ఇది మంచి వ్యాయామం అవుతుంది. ప్రతిరోజూ సైక్లింగ్ చేసేవాళ్లకు క్యాన్సర్ రిస్క్ 45 శాతం తగ్గుతుందని ఒక పరిశోధనలో తేలింది. డయాబెటిస్ తో బాధ పడేవాళు ప్రతిరోజూ సైక్లింగ్ చేయడం వల్ల ఆ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ఫ్యాట్ సమస్యతో బాధ పడేవాళ్లు సైక్లింగ్ చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
ప్రతిరోజూ సైక్లింగ్ చేసేవాళ్లు జిమ్ కు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. సైక్లింగ్ వల్ల మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజూ సైక్లింగ్ చేసే వాళ్లలో సెరటోనిన్, ఎండార్ఫిన్ అనే హ్యాపీ కెమికల్స్ విడుదలవుతాయని ఈ కెమికల్స్ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.