కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమ కుదేలైంది. గత ఆరేడు నెలలుగా థియేటర్లు మూతపడగా.. షూటింగులు వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడు ఈ రంగాలు తిరిగి గాడిలో పడుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగులు.. సినిమా థియేటర్లను నడిపిస్తున్నారు.
Also Read: రాశీ ఖన్నా బాధను కాస్త పట్టించుకోండి బాబూ
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గముఖం పట్టలేదు. దీనికితోడు ప్రభుత్వం విధించిన నిబంధనలు థియేటర్లకు కత్తిమీద సాములా మారాయి. 50శాతం అక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తుండటం వాటి నిర్వాహకులకు మింగుడు పడటం లేదు. ఇలా చేస్తే తమకు నిర్వహణ ఖర్చులు కూడా రావని థియేటర్ల యజమానులు వాపోతున్నారు.
ఇదిలా ఉంటే.. టాలీవుడ్లో అప్పుడే సంక్రాంతి మొదలైనట్లు కన్పిస్తోంది. ఇటీవల వరకు థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయాలా? వద్దా? అని సందేహంలో ఉన్న నిర్మాతలు సై అంటున్నారు. దీంతో సంక్రాంతి రేసు మొదలైనట్లు కన్పిస్తోంది. ఇప్పటికే నాలుగైదు పెద్ద సినిమాలు సంక్రాంతి రేసులో తమ సినిమాలున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.
ప్రతీయేటా సంక్రాంతి మాదిరిగానే ఈయేడు కూడా థియేటర్లు కళకళలాడేలా కన్పిస్తున్నాయి. రామ్ హీరోగా నటించిన ‘రెడ్’.. రానా ‘అరణ్య’ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. తాజాగా దసరా సందర్భంగా మరో రెండు సినిమాలు కూడా సంక్రాంతి వస్తున్నట్లు ప్రకటించాయి.
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘క్రాక్’.. నితిన్ ‘రంగ దే’ మూవీలు సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించాయి. ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. సంక్రాంతికి ఈ సినిమాలు రెడీ కావడం పెద్ద కష్టమేమీ కాదని తెలుస్తోంది. మరోవైపు పాన్ ఇండియా మూవీగా ‘కేజీఎఫ్-2’ కూడా సంక్రాంతికే రానుందనే టాక్ విన్పిస్తోంది.
Also Read: ట్రైలర్ టాక్: ‘ఆకాశం నీ హద్దురా’.. విమాన ప్రయాణం చేరువైందిలా?
దీంతో ఈ సంక్రాంతికి థియేటర్లు కళకళలాడటం ఖాయంగా కన్పిస్తోంది. అయితే కరోనా ఎఫెక్ట్.. వ్యాక్సిన్ రాకపైనే థియేటర్ల పరిస్థితి ఆధారడి ఉంటుందనే స్పష్టమవుతుంది. సంక్రాంతి వరకు కరోనా తగ్గముఖం పడితే వందశాతం అక్యుపెన్సీతో థియేటర్లు మునుపటిలా మారతాయి. లేకుంటే థియేటర్ యాజమాన్యాలు మరిన్ని రోజులు ఇబ్బందులు పడాల్సిందేననే టాక్ విన్పిస్తోంది. దీంతో సంక్రాంతి హౌస్ ఫుల్లే.. కానీ అన్నట్లుగా సీన్ మారింది.