బిగ్ బాస్-4: మొనాల్ తో హైపర్ ఆది పులిహోర.. నవ్వకుండా ఉండలేరు? 

తెలుగు రియల్టీ షోలో బిగ్ బాస్ నెంబర్ వన్ కొనసాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్-4 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్-4 సీజన్ 50రోజులను పూర్తి చేసుకుంది. దసరా సందర్భంగా బిగ్ బాస్-4 స్పెషల్ కార్యక్రమం నిర్వహించింది. నాగార్జున ప్లేసులో సమంత హోస్టుగా అలరించింది. హీరోహీరోయిన్లు పాయల్.. కార్తీకేయ.. కామెడీయన్ హైపర్ ఆది ‘బిగ్ బాస్-4’లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. Also Read: బిగ్ బాస్-4: మాస్టర్ వెన్నుపొటుకు ‘దివి’ […]

Written By: NARESH, Updated On : October 26, 2020 12:57 pm
Follow us on

తెలుగు రియల్టీ షోలో బిగ్ బాస్ నెంబర్ వన్ కొనసాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్-4 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్-4 సీజన్ 50రోజులను పూర్తి చేసుకుంది. దసరా సందర్భంగా బిగ్ బాస్-4 స్పెషల్ కార్యక్రమం నిర్వహించింది. నాగార్జున ప్లేసులో సమంత హోస్టుగా అలరించింది. హీరోహీరోయిన్లు పాయల్.. కార్తీకేయ.. కామెడీయన్ హైపర్ ఆది ‘బిగ్ బాస్-4’లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు.

Also Read: బిగ్ బాస్-4: మాస్టర్ వెన్నుపొటుకు ‘దివి’ బలి?

జబర్దస్త్ తో తన కామెడీతో అలరించే హైపర్ ఆది ‘బిగ్ బాస్-4’లోనూ నవ్వులు పూయించాడు. బిగ్ బాస్-4లోకీ ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తాను డిటెక్టర్ ను అంటూ చెప్పుకున్నాడు. ఇప్పటివరకు బిగ్ బాస్ లో ఎవరెవరు ఎలాంటి పనులు చేశారో తనకు తెలుసని చెప్పుకొచ్చాడు. ఈక్రమంలోనే సమంత కలుగజేసుకొని హౌస్ లోని కంటెస్టుల గురించి చెప్పమంటుంది. దీంతో ఆది ఒక్కొక్క కంటెస్టులోని మంచి.. చెడులను వివరించడం మొదలుపెట్టాడు.

డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ లో రాము.. రేమో.. అపరిచితుడని ఉన్నాడంటూ నవ్వులు పూయించాడు. సొహైల్‌ అర్జున్ రెడ్డిలా ఉండేవాడని.. ఇప్పుడు స్వాతి ముత్యంలా తయారయ్యాడన్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నావు కాబట్టే టీవీలో ఉన్నావు.. లేకుంటే టీవీ బయట ఉండేవాడివని సొహైల్ పై పంచ్ వేయడంతో అందరూ నవ్వుకున్నారు. పనిలో పనిలో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్‌తో పులిహోర కలిపేశాడు.

మొనాల్ ను చూస్తుంటే తన సొంత క్రష్ లా ఉందంటూ ఆమెతో పులిహోర కలిపేందుకు ప్రయత్నించాడు. తన పేరు కూడా ‘ఏ’తోనే మొదలవుతుందని అభిజిత్.. అఖిల్ తో ప్రేమాయణాన్ని గుర్తుచేశాడు. దీంతో సమంత కలుగజేసుకొని మీరు హైపర్ ఆది కాదా.. మీ పేరు హెచ్ తో మొదలవుతుందని అనగా.. మొనాల్ కోసం తీసేసుకోలేమా అనడంతో హౌస్ లోని వారంతా నవ్వుకున్నారు.

Also Read: రూ.5000 పెట్టుబడితో లక్షల రూపాయల లాభం.. ఏం బిజినెస్ అంటే..?

మెహబూబ్ ‘మంచి మనుషులు కొంటె రాక్షసులు’ టాస్కులో మంచి మనిషిగా మారడం చూసిన తనకు ఆర్జీవీ శంకరాభరణంకు దర్శకత్వం వహించినట్లు అనిపించిందన్నారు. అఖిల్‌ ఎక్కువగా మోనాల్‌ దగ్గరే ఉంటాడని.. దీంతో ఎడిటర్లకు పని తక్కువవుతుందని చెప్పి నవ్వులు పూయించారు. అలాగే హరిక.. అభిజిత్.. నోయల్.. అవినాష్.. లాస్యలపై తనదైన పంచ్ వేస్తూ హౌస్ లో నవ్వులు పూయించాడు.