టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నేడు. ఈరోజు గులాబీ దళపతి తన 67వ జన్మదినాన్ని జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. పెద్ద ఎత్తున సేవ కార్యక్రమాలు చేపడుతున్నాయి.
ఉద్యమ నాయకుడు, తెలంగాణ రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ అంతటా ఘనంగా జరుగుతున్నాయి. 60 ఏళ్ల ప్రజల తెలంగాణ స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ, రాష్ట్రపతి, గవర్నర్, సీఎం చంద్రబాబు, ఇతర ముఖ్యమంత్రులు, మంత్రులు ఆయనకు విషెస్ చెబుతున్నారు..
ఇక కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘కోటి వృక్షార్చన’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ పుట్టిన ఈఱోజున కోటి మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికి సినీ, రాజకీయ సెలబ్రెటీలందరూ మద్దతు పలికి ట్వీట్లు చేస్తూ మొక్కలు నాటుతున్నారు.
కేసీఆర్ పుట్టిన రోజున హైదరాబాద్ సహా తెలంగాణలోని ఆలయాల్లో టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బల్కంపేట ఎల్లమ్మదేవికి బంగారు చీరను టీఆర్ఎస్ నేతలు సమర్పించారు.దాతల సహకారంతో రెండున్నర కేజీల బంగారంతో రూపొందించిన ఈ చీరను అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బహూకరించారు.
ఇక జలవిహార్ లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జీవితంపై 30 నిమిషాల డాక్యుమెంటరీని తలసాని విడుదల చేస్తున్నారు.
*అలుపెరగని బాటసారి
తెలంగాణ కోసం కొట్లాడి.. చివరకు ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని సిద్దించాక ఒక దఫా ఐదేల్ల కాలం పూర్తి చేసిన కేసీఆర్ ఇప్పుడు బాగా సైలెంట్ అయ్యారు. మునుపటి పాలన వాడి, వేడి బాగా తగ్గించారు.అంతకుముందు ఆంధ్రా నాయకులు ఎవ్వరు విమర్శించినా.. తెలంగాణకు అన్యాయం జరిగినా ఉవ్వెత్తున ఎగిసి ప్రత్యర్థులకు దిమ్మదిరిగేలా ఆరోపణలు చేసే కేసీఆర్ తెలంగాణ వచ్చాక బాగా నెమ్మదించారు.
తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్రాన్ని పట్టాలెక్కించేందుకు కేసీఆర్ పలు ప్రయత్నాలు చేశారు. వ్యూహాలు పన్నారు. ముందు ప్రభుత్వాన్ని సుస్థిరం చేసేందుకు నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అనంతరం దేశం ఆకర్షించేలా పలు అద్భుత పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణను వృద్ధిరేటులో దూసుకుపోయిస్తున్నారు. 19.5 శాతం వృద్ధిరేటు ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందంటే అది కేసీఆర్ పథకాల చలువే.. సంవత్సరం తిరిగేసరికి తెలంగాణలో పార్టీని.. పాలనను గాడిలోపెట్టిన కేసీఆర్ ఆ తరువాత చాలా బాధ్యతలను దించేసుకున్నారు. హైదరాబాద్ మహానగర పాలక ఎన్నికలను కొడుకు కేటీఆర్ కు అప్పగించి సేదతీరారు. పెద్దగా జిల్లాల పర్యటనకు కూడా వెళ్లడం లేదు. అంతా ఇంట్లోనే కూర్చొని అదికారులు, మంత్రులను రమ్మని సమీక్షిస్తూ పనులను, పాలనను వేగవంతం చేస్తున్నారు..
ప్రస్తుతం ఏడేళ్ల తెలంగాణ పాలన ముగిశాక.. ఇన్నాళ్లు తాను ఉద్యమంలో, రాజకీయంలో పడి కోల్పోయిన సరదాలను, కుటుంబ బంధాలను కేసీఆర్ ప్రస్తుతం అనుభవిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో కేటీఆర్ కు అప్పగించేసి.. అధికారులను పురమాయిస్తూ మంత్రులతో కమిటీలు వేసి చక్కదిద్దుతూ కేసీఆర్ ఇంటికే పరిమితమవుతున్నారు. తాను కోల్పోయిన కుటుంబం బాంధవ్యాలను ప్రస్తుతం అనుభవిస్తున్నారు..
కేసీఆర్ కు తన మనవడు.. కేటీఆర్ కొడుకు హిమాన్షు అంటే చాలా ఇష్టం.. తాత కేసీఆర్ తన సొంతూరు సిద్దిపేట మడకశిర వెళ్లినా.. ఎదైనా చారిత్రక ప్రదేశానికి వెళ్లినా.. లేక.. క్రిస్ మస్, రంజాన్ ఇఫ్తార్ విందులు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు వెళ్లిన మనవడు హిమాన్షును తప్పక తీసుకెళ్తారు. మనవడితో తన జ్ఞాపకాలను పంచుకుంటారు. కేసీఆర్ ఇంట్లో ఆయన తర్వాత బాగా ఇష్టమైన వ్యక్తి హిమాన్షునేనట..
కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కేటీఆర్ ఇంటికే పరిమితమై చిన్న చిన్న సంబరాల్లో పాల్గొనగా.. ఎంపీ కవిత మాత్రం నాన్నపై ప్రేమతో ఘనంగా కేసీఆర్ బర్త్ డే నిర్వహించారు. బల్కంపేట అమ్మవారికి టీఆర్ఎస్ నేతలు తెచ్చిన రెండున్నర కిలోల బంగారు చీరను బహూకరించారు.. నాన్న అంటే తనకు ప్రాణమని చెప్పుకొచ్చారు.