https://oktelugu.com/

కేంద్రం కీలక నిర్ణయం.. ఉద్యోగులకు శుభవార్త..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ అంశానికి సంబంధించి కేంద్రం నుంచి మరో కీలక ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో చేరడానికి కేంద్రం అనుమతి ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో చేరడానికి 2021 సంవత్సరం మే 31వ తేదీ చివరి తేదీగా ఉంది. ఈ స్కీమ్ ను ఎంచుకోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 1, 2021 / 06:41 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ అంశానికి సంబంధించి కేంద్రం నుంచి మరో కీలక ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో చేరడానికి కేంద్రం అనుమతి ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో చేరడానికి 2021 సంవత్సరం మే 31వ తేదీ చివరి తేదీగా ఉంది. ఈ స్కీమ్ ను ఎంచుకోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీమ్ ను ఎంచుకోవడానికి అర్హులు.

    Also Read: 224 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ వేతనంతో..?

    నేషనల్ పెన్షన్ స్కీమ్ తో పోలిస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. 2004 సంవత్సరం జనవరి నెల 1వ తేదీకి ముందు ఉద్యోగాలలో చేరిన వారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో చేరడానికి అర్హులు. పాత పెన్షన్ విధానం ద్వారా పెన్షనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆర్థికపరమైన భద్రత లభిస్తుందని సమాచారం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 98 లక్షలుగా ఉంది.

    2021 సంవత్సరం జనవరి నాటికి నేషనల్ సిస్టమ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 98 లక్షలు కాగా భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సాయుధ దళాలు మినహా 2004కు ముందు ఉద్యోగాలలో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ స్కీమ్ లో చేరవచ్చు. కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా జాబ్స్‌లో చేరిన వాళ్లకు మాత్రం కేంద్రం ఈ స్కీమ్ లో చేరే అవకాశం కల్పిస్తోంది.

    Also Read: ఇంటర్, డిగ్రీ పాసయ్యారా.. 6552 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

    ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో కేంద్రం వెఉస్లుబాటు కల్పిస్తున్న నేపథ్యంలో అవకాశం ఉన్నవారు వెంటనే ఈ స్కీమ్ లో చేరితే మంచిది. కేంద్రం ఉద్యోగులకు ప్రయోజనం చేకూరెలా తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.