ఒకప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశం రాజకీయాల్లో ప్రభావితం చూపలేకపోతోంది. అంతేకాదు.. రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి కనీసం పోటీనివ్వలేకపోతోంది. ఎక్కడా తన బలం చూపలేకోపోతోంది. సరైన నాయకత్వం లేకపోవడం, ఆ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాలేకపోవడం ఇందుకు కారణాలవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సైతం కాంగ్రెస్‌ను అంటరాని పార్టీగానే చూస్తున్నాయంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: హైదరాబాద్ లో రోహింగ్యాల వేట మొదలైంది..
ఎంతో మంది మహామహులు.. ఎంతో మంది రాజకీయ నిపుణులు కలిగిన పార్టీ కాంగ్రెస్. దేశ స్వాతంత్ర్యం నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఏడేళ్లుగా అధికారాన్ని కోల్పోయింది. 2014 నుంచి పార్టీ ఫేట్ మారింది. ఇక బీజేపీ తరఫున మోదీ, అమిత్ షాల నాయకత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీనికి తోడు రాహుల్ గాంధీ అపరిపక్వత విధానాలు ఆ పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి. ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదన్న ముద్ర ప్రజల్లో ముద్రపడింది.
Also Read: రేపటితో తేలనున్న రజనీ రాజకీయ భవితవ్యం..?
వారసత్వంగా వస్తున్న ఏఐసీసీ అధ్యక్ష పదవిని రాహుల్‌ను చేపట్టమంటే ఏడాదిన్నరగా నాన్చుతున్నారు. దీంతో ఆ పదవిని వేరే వారికి అప్పగించడం లేదు. పోనీ అలా ఎవరైనా ప్రశ్నించినా వారిపై ఎదురుదాడికి దిగుతారు. అధిష్టానాన్ని ప్రశ్నించకూడదనే పంథా కొనసాగుతోంది. సీనియర్ నేతల సలహాలు తీసుకోరు. మరోవైపు సోనియా గాంధీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో అంతా రాహుల్ గాంధీయే పార్టీ నిర్వహణను చూసుకుంటున్నారు. కానీ అనధికారికంగా మాత్రమే.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం: జాతీయ పాలిటిక్స్
పార్టీ కూడా రానురాను ఓట్ బ్యాంకును కోల్పోతోంది. దీంతో పార్టీనే నమ్ముకుని ఉన్న వారిలో స్థైర్యం పోతోంది. బీహార్‌లో 19 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని 9.48 శాతం ఓట్లను మాత్రమే సాధించగా.. ఎంఐఎంకు 12.4 శాతం ఓట్లు రావడం ఆశ్చర్యం కలిగించే అంశమే. ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటు శాతం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. రానున్న బీహార్, తమిళనాడు, కేరళ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటే ఇక కాంగ్రెస్ దుకాణం మూసివేయక తప్పదు.