కరోనా మహమ్మరి ప్రపంచాన్ని ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు. చైనాలో మొదలైన కరోనా వైరస్ క్రమంగా అన్ని దేశాలకు పాకింది. ప్రస్తుతంలో ప్రపంచంలోని అన్నిదేశాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి.
Also Read: యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారి లెక్క తేలిందా?
2020లో తొలినాళ్లలో వెలుగుచూసిన ఈ వైరస్ కు సైంటిస్టులు ఏడాది చివరి నాటికి వాక్సిన్ కనిపెట్టారు. అయితే ఈ వ్యాక్సిన్ అన్ని దేశాల్లోని వ్యక్తులకు సరిపోతుందా? లేదా అనే అనుమానాలను పలువురు చేస్తున్న సంగతి తెల్సిందే.
దీనికితోడు ప్రస్తుతం బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కొత్తరకం కరోనా వైరస్ వెలుగుచూడటం అందరినీ టెన్షన్ కు గురిచేస్తోంది. ఈ కొత్త వైరస్ కరోనా కంటే 70శాతం అధికంగా వ్యాప్తి చెందుతోంది.
అయితే కరోనాకు కనుగొన్న వ్యాక్సిన్ కొత్తరకం వైరస్ పై పని చేస్తుందా? లేదంటే దీని కోసం మళ్లీ వ్యాక్సిన్ తయారు చేయాలా? అనే ప్రశ్నలు ప్రతీఒక్కరిలోనూ రేకెత్తుతోన్నాయి.
Also Read: బ్రేకింగ్: ఏపీ నూతన సీఎస్ గా ఈయనే.. భారీ ప్రక్షాళన
ఈ విషయంపై తాజాగా బయోఎన్‌టెక్ సంస్థ స్పందించింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్.. బ్రిటన్‌లోని కరోనా కొత్త స్ట్రెయిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటుందని బయోఎన్‌టెక్ కో-ఫౌండర్ ఉగుర్ సహిన్ చెప్పారు.
అవసరమైతే కొత్త రకం వ్యాక్సిన్‌ను కూడా తక్కువ వ్యవధిలోనే తీసుకొస్తామని తెలిపారు. ఇందుకు కేవలం ఆరు వారాల సమయం సరిపోతుందన్నారు.
ఫైజర్ వ్యాక్సిన్ తయారీలో బయోఎన్‌టెక్ కంపెనీ సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అయితే వైరస్ రూపాంతరం చెందాడం చాలా సాధారణ విషయమని వైరాలజీ నిపుణులు చెబుతుండటం గమనార్హం.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్