TSPSC ఛైర్మన్ గా ఉన్న ఘంటా చక్రపాణి పదవీకాలం డిసెంబర్ 17తోనే ముగిసింది. అదేరోజు ప్రభుత్వం TSPSC ఛైర్మన్ ను నియమిస్తుందని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వం ఛైర్మన్ నియామకంపై నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనుందని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సీఎం ఆదేశాలతో అధికారులు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశాలపై హడావుడి చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలలో అధికశాతం TSPSC ద్వారానే భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కొత్త ఛైర్మన్ ను ప్రభుత్వం నియమించకపోవడం నిరుద్యోగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే TSPSC చైర్మన్ ఎంపికలో ప్రభుత్వ పెద్దలు డైలామాలో ఉన్నట్టు తెలుస్తోంది.
TSPSC ఛైర్మన్ పదవీని రాజకీయంగా నియమించాలా? లేదా రిటైర్డ్ అధికారిని నియమించాలా? అనేది ప్రభుత్వం తేల్చుకోలేపోతుంది. ఈ పదవీకి ఉన్న పరిమితుల దృష్ట్యా కొంచెం.. అటూ ఇటూ అయినా ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంది. చైర్మన్ లేదా సభ్యుల వయస్సు 62ఏళ్లకు మించి ఉండరాదనే నిబంధన ఉంది.
దీంతో రిటైర్డ్ IASనో లేదా IPSనో ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదని టాక్ విన్పిసోంది. ఒకవేళ రాజకీయ పరమైన నియామకం చేపడితే ప్రభుత్వంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఛైర్మన్ రేసులో నవీన్‌చంద్.. విఠల్ పేర్లు తెరపైకి వచ్చినా ఎవరి పేర్లు ఖరారు కాలేదు.
సీఎం కేసీఆర్ 50వేల ఉద్యోగాల భర్తీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రతిపక్షాలు ఛైర్మన్ ను టార్గెట్ చేసే అవకాశం మొండుగా ఉంది. ఈ కారణంతోనే కమిషన్ సభ్యులు ఛైర్మన్ పదవీపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఛైర్మన్ గా ఎవరినీ నియమిస్తుందనే ఆసక్తి నెలకొంది.