ధోనీ.. ఓ గొప్ప క్రికెటర్. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా గట్టెక్కించాలో తెలిసిన చాణక్యుడు. ఓ వైపు మ్యాచ్ ఉత్కంఠకు దారితీస్తున్నా.. సహచర సభ్యులను ఏ మాత్రం టెన్షన్‌కు గురిచేయకుండా జట్టును విజయతీరాలకు చేర్చగల సమర్ధుడు. జట్టు కూర్పు కూడా ఎలా ఉండాలో తెలిసిన వాడు. అందుకే.. ఇండియాకు ఓ వరల్డ్ కప్. టీ20 వరల్డ్ కప్‌ను సాధించి పెట్టారు. అయితే.. మిస్టర్ కూల్ కెప్టెన్ 2007 టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టును ఎంపిక చేసే సమయంలో చెప్పిన మాటలను నిలబెట్టుకున్నాడని మాజీ సెలక్టర్ సంజయ్ జగ్దాల్ చెప్పారు.
Also Read: ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్: పట్టుబిగించిన టీమిండియా
తాజాగా.. ఆయన ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడారు. అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తాను సెలక్టర్‌గా ఉన్న సమయంలో మొదటి టీ20 ప్రపంచ కప్ టోర్నీకి దిగ్గజ ఆటగాళ్లైన సచిన్, గంగూలీ, ద్రవిడ్.. తమని ఎంపిక చేయొద్దని స్వయంగా చెప్పారన్నారు. దీంతో యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియాను ఎంపిక చేసి ధోనీని తొలిసారి కెప్టెన్‌గా చేశామని వెల్లడించారు.
ఆ సమయంలో ధోనీ మాట్లాడుతూ.. కచ్చితంగా ప్రపంచకప్‌తో తిరిగి వస్తానని చెప్పాడని సంజయ్ గుర్తుచేసుకున్నారు. అతడి ఆత్మవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. 2007లో టీమ్ ఇండియా రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో వన్డే ప్రపంచ కప్‌లో ఘోర పరాభవం పాలైంది. అనంతరం జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్‌లో ధోనీ సారథ్యంలో పాకిస్థాన్‌పై ఉత్కంఠ పోరులో ఫైనల్ మ్యాచ్ గెలిచింది.
Also Read: భారత్ చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మ
ఇక మహీ సారథ్యం తీసుకున్నాక.. ఇండియా జట్టును ప్రతింటా విజయపథంలో నడిపించారు. వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ భారత్‌ను టాప్ ప్లేస్‌లోకి తెచ్చారు. 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాడు. ఆపై 2014 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు, 2015 వన్డే ప్రపంచకప్‌లో సమీస్‌కు, 2016 టీ20 ప్రపంచకప్‌లో మరోసారి సెమీస్‌కు తీసుకెళ్లాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలవ్వడంతో ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించాడు.